విజయసాయిరెడ్డిపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. లిక్కర్ పాలసీకి మిథున్ రెడ్డికి ఏమిటి సంబంధం.?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan
YS Jagan: మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. మూడేళ్లు రాజ్యసభ స్థానంను ప్రలోభాలకులోనై చంద్రబాబుకు అమ్మేశాడు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్స్ కి విలువ ఏముంది..? అంటూ జగన్ అన్నారు.
రాజ్ కేసిరెడ్డి చాలా మంది ప్రభుత్వ సలహాదారుల్లో ఆయన ఒకరు. కేసిరెడ్డి టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి సన్నిహితుడు. ఇద్దరూ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. లిక్కర్ పాలసీకి మిథున్ రెడ్డికి ఏమిటి సంబంధం అంటూ జగన్ ప్రశ్నించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలకు ఏమి సంబంధం..? ఇద్దరు మచ్చలేని అధికారులు. ఒక ఫైల్ అయినా సీఎంవోకి వచ్చినట్లు ఒక్క సంతకం అయినా చూపించగలరా…? అంటూ జగన్ ప్రశ్నించారు.
గోవిందప్ప అనే వ్యక్తి మల్టీ నేషనల్ కంపెనీలకు డైరెక్టర్. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. గోవిందప్పకు నా కంపెనీలకు సంబంధం లేదు. డీజీ స్థాయి అధికారిని అక్రమంగా జైల్లో పెట్టారు. డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసి వేధిస్తున్నారు. సంజయ్, విజయ్ పాల్, కాంతిరానా, విశాల్ గన్ని వంటి ఎందరో అధికారులను వేదిస్తున్నారు. 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేదిస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.