వైసీపీ నేత విజయసాయి రెడ్డి వాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు?: వైఎస్‌ షర్మిల

ముడుపులు వాళ్లకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా? అని షర్మిల అన్నారు.

వైసీపీ నేత విజయసాయి రెడ్డి వాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు?: వైఎస్‌ షర్మిల

Ys Sharmila

Updated On : December 16, 2024 / 7:29 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తప్పు చేస్తే.. సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

“మౌనంగా ఉంటున్నారు అంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా? సక్రమం కాబట్టే రద్దు చేయలేదు అని చెప్పకనే చెప్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్పా.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా ? పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా అంత తూచ్ కిందనేనా ? అదానీ జగన్ నే కాదు మిమ్మల్ని కూడా కొన్నారని చెప్తారా ?

ముడుపులు వాళ్లకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా ? అందుకేనా ACB ని పంజరంలో బంధించారు ? ఇందుకేనా అదానీపై ఒక్క మాటకూడా లేదు ? ఇదేనా బాబు గారు మీ 40 ఏళ్ల రాజకీయం ? 1750 కోట్ల లంచాలు తీసుకొని, రాష్ట్ర ప్రజల నెత్తిన 1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలు చేసే డీల్ పై మీరు మౌనంగా ఉన్నా… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమాన్ని ఆపదు.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, న్యాయబద్ధంగా కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము సిద్ధం. ఇప్పటికైనా డీల్ రద్దు చేసి.. 1750 కోట్ల ముడుపుల పై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల అన్నారు.

Minister Parthasarathy : జోగి రమేశ్ వ్యవహారం.. సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన మంత్రి