Ys Sharmila: పీసీసీ చీఫ్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. శిబిరం నుంచి తరలింపు..

శిబిరం నుంచి షర్మిలను తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

Ys Sharmila: పీసీసీ చీఫ్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. శిబిరం నుంచి తరలింపు..

Updated On : May 21, 2025 / 11:41 PM IST

Ys Sharmila : APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో తొలగించిన 2వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆమె దీక్షకు దిగారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కూర్మన్నపాలెం ధర్నా శిబిరంలో షర్మిల దీక్షకు కూర్చున్నారు. కాగా, రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. శిబిరం నుంచి షర్మిలను తరలించారు. ఈ క్రమంలో పోలీసులను కాంగ్రెస్‌ శ్రేణులు, స్టీల్‌ ప్లాంట్ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

Also Read: ఏపీలో ఫ్యాన్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయా? వైసీపీ మున్సిపాలిటీలు ఖాళీ కాబోతున్నాయా?

షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. అకారణంగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యబద్దంగా, గాంధేయ మార్గంలో దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణం అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒక మహిళ అని చూడకుండా అత్యంత పాశవికంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర అని ఆరోపించారు. కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతుకను అణగదొక్కి, వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.

ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కును అందరూ కలిసి అమ్మేయాలన్ని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కుట్రలు చేసుంటే ప్రశ్నించకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి మోకరిల్లారని ధ్వజమెత్తారు. ఆంధ్రుల ఆత్మగౌరవం స్టీల్ ప్లాంట్ ను మోదీ కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. దీక్షలు భగ్నం చేసినా, కార్మికులను భయపెట్టి సమ్మె విచ్చిన్నం చేసినా, రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని కార్మికులకు మాట ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు.