YS Viveka Case: వైఎస్ వివేకా కుమార్తె సునీత భావోద్వేగభరిత వ్యాఖ్యలు

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన కుమార్తె సునీత నివాళులు అర్పించారు. అనంతరం సునీత భావోద్వేగభరితంగా మాట్లాడారు. "న్యాయం గెలవాలి.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదు.. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి" అని అన్నారు.

YS Viveka Case: వైఎస్ వివేకా కుమార్తె సునీత భావోద్వేగభరిత వ్యాఖ్యలు

YS Viveka Case

Updated On : March 15, 2023 / 11:27 AM IST

YS Viveka Case: వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన కుమార్తె సునీత నివాళులు అర్పించారు. అనంతరం సునీత భావోద్వేగభరితంగా మాట్లాడారు. “న్యాయం గెలవాలి.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదు.. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి” అని అన్నారు.

“ఈ కేసులో విచారణ సమయంలో ఎవరైనా మాట్లాడటం సరికాదు.. దర్యాప్తు సంస్థలను కానీ, పోలీసులను కానీ వారి దర్యాప్తు వారు చేసుకునేలా సహకరించాలి. వివేకా కేసు విషయంలో ఎంతో మంది తెలియకుండానే సహరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు” అని సునీత అన్నారు. తనకు తెలిసిన విషయాలు అన్నింటినీ సీబీఐకి డాక్యుమెంట్ల రూపంలో వెల్లడించానని చెప్పారు.

తాను సీబీఐకి అన్ని విషయాలు చెబుతున్నానని సునీత తెలిపారు. ఈ కేసులో కొందరు చేస్తున్న ఆరోపణల గురించి తనకు తెలుసని అన్నారు. తన తండ్రి హత్యపై కొందరు గతంలో తేలిగ్గా మాట్లాడారని అన్నారు. కర్నూలు, కడప వంటి చోట్ల ఇలాంటివి సాధారణమే కదా? అని తనతో అన్నారని చెప్పారు. తన తండ్రిని హత్య చేసింది ఎవరో తెలుసుకోకుండా వదలిపెట్టనని తెలిపారు.

AP Assembly Budget Session-2023: అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అంబటి ఆగ్రహం.. LiveUpdates