చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు
నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు.

నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు.
నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు. చంద్రబాబు ఎన్ని స్వార్థ రాజకీయాలు చేసినా.. ఇద్దరూ గెలవలేదన్నారు. జగన్ సంధించిన రామబాణానికి.. బాబు ఎప్పుడో నేలకూలారన్నారు విజయసాయిరెడ్డి.
తెలుగుదేశాన్ని చంద్రబాబే గొంతుపిసికి చంపేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. తన పార్టీని బీజేపీకి ధారాధత్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అన్న భావనలో బాబు ఉన్నారని అన్నారు. వైసీపీ నవరత్నాలతో.. ఐదేళ్లలోనే సామాజిక విప్లవం రాబోతోందన్నారు. ఇది.. బాబుకు ఐదు నెలల్లోనే అర్థమైందని చెప్పారు. బీసీలంతా సీఎం జగన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలెప్పుడూ బాబును నమ్మలేదు