Simhadri Chandrasekhar : మచిలీపట్నం ఎంపీ ఇంఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఖరారు..!
Simhadri Chandrasekhar : మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది.

Ysrcp
Simhadri Chandrasekhar : మచిలీపట్నం ఎంపీ ఇంఛార్జిగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ప్రకటించారు.
గురువారం సాయంత్రం (మార్చి 7న) మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. సీఎం జగన్ ఆదేశాల మేరకు సింహాద్రి చంద్రశేఖర్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని చెప్పారు. గతంలో సింహాద్రి చంద్రశేఖర్‌ను అవనిగడ్డ అసెంబ్లీ ఇంఛార్జిగా వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంట్ ఇంఛార్జిగా ఉన్న సింహాద్రి రమేష్‌ను తిరిగి అవనిగడ్డకు మార్చేసింది.
అందుకే ఆయన పేరు ప్రకటించాం : పేర్ని నాని
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ అంగీకరించారని, అందుకే ఆయన పేరును ప్రకటించినట్టు పేర్ని నాని తెలిపారు. 35 ఏళ్లుగా సౌత్ ఇండియాలో క్యాన్సర్ వైద్యుడిగా సేవలు అందించారని, ఈ ప్రాంతానికి చంద్రశేఖర్ బాగా సుపరిచితులుగా పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో చంద్రశేఖర్ పార్టీలకు అతీతంగా అందరికీ తెలుసనన్నారు.
చంద్రశేఖర్ తండ్రి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారని గుర్తు చేశారు. ఓ గొప్ప డాక్టర్ మా పార్లమెంట్ ప్రజలకి సేవ చేసేందుకు ముందుకు వచ్చారని పేర్ని నాని కొనియాడారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తునందుకు అందరం ఆనందిస్తున్నామని, ఇలాంటి మంచి అభ్యర్థిని ఇచ్చినందుకు సీఎం జగన్‌కు పేర్ని నాని ధన్యవాదాలు తెలిపారు.
ఇన్నాళ్లు వైద్య సేవ చేశా.. ఇప్పుడు ప్రజా సేవ చేస్తా :
వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ స్పందించారు. ‘నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. గతంలో నన్ను సీఎం జగన్ అవనిగడ్డ ఇంఛార్జిగా నియమించారు. నా ఇమేజ్ పార్లమెంట్‌కు సరిపోతుందని పార్లమెంట్‌కు పంపించారు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇన్నాళ్లు వైద్య సేవలు చేశాను.. ఇప్పుడు మరింతగా ప్రజా సేవ చేస్తాను’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Read Also : Chandrababu Naidu : క్లైమాక్స్‌లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం