Chandrababu Naidu : క్లైమాక్స్‌లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం

ఏపీలో పొత్తులు, సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు.

Chandrababu Naidu : క్లైమాక్స్‌లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం

Updated On : March 7, 2024 / 8:23 PM IST

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు పవన్ కూడా ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించనున్నారు.

ఏపీలో పొత్తుల అంశంపై ఓ క్లారిటీ రానుంది. టీడీపీ-జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నదానిపై ఢిల్లీ వేదికగా ఒక స్పష్టత రానుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఢిల్లీలో ఉన్నారు. ఏపీలో ఉన్న నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులు, పోటీ చేయాల్సి స్థానాలపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కాబోతోంది.

టీడీపీ-జనసేన-బీజేపీ కలయిక.. 2014లో విన్నింగ్ కాంబినేషన్ గా ఉంది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ ను రిపీట్ చేయాలా? లేక ఏ విధంగా ముందుకెళ్లాలి ఎన్నికల వ్యూహాలలో అన్న అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా ఒక స్పష్టత అయితే రాబోతోంది.

Also Read : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ