Pothina Venkata Mahesh : అలాంటి వ్యక్తులతో వంగవీటి రాధా చేతులు కలపడం దురదృష్టకరం- పోతిన మహేశ్

అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా? మాకు పదవుల మీద వ్యామోహం లేదు.

Pothina Venkata Mahesh : అలాంటి వ్యక్తులతో వంగవీటి రాధా చేతులు కలపడం దురదృష్టకరం- పోతిన మహేశ్

Pothina Venkata Mahesh

Updated On : December 26, 2024 / 4:31 PM IST

Pothina Venkata Mahesh : విజయవాడ చెరువు సెంటర్ లో వంగవీటి రంగా 36వ వర్ధంతి నిర్వహించారు. రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు వైసీపీ నేత పోతిన మహేశ్. ఈ సందర్శంగా వంగవీటి రాధాపై సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వంగవీటి రంగా అందరి వాడు, కానీ సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.

రంగా ఉద్యమ వారసులుగా మేము అనేక పోరాటాలు చేశామన్నారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారని వాపోయారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు.. కానీ, రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడని వ్యక్తి రాధా అని పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు.

Also Read : తుగ్లక్ చర్యల్లో వైఎస్‌ జగన్ మరో మైలురాయిని దాటారు: గొట్టిపాటి రవికుమార్

‘రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా వంగవీటి రాధా ఎప్పుడూ బయటకు రాలేదు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి. ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది. ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారు. మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు బాధేస్తుంది.

Pothina Mahesh

Pothina Mahesh (Photo Credit : Facebook)

రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకు? వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి అనేకం ఉన్నాయి. రాధా పదవి గురించి మాట్లాడడం కాదు.. రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలి. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా? మాకు పదవుల మీద వ్యామోహం లేదు. సీటు రాకపోయినా పోరాటం చేస్తున్నాం. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరం’ అని పోతిన మహేశ్ వాపోయారు.

Also Read : విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెబుతున్నవన్నీ అసత్యాలే: వైఎస్ షర్మిల