కేసులు, గొడవలు మాకు కొత్త కాదు.. మరింత రాటుదేలుతాం- అంబటి రాంబాబు

ఈవీఎం ధ్వంసం వీడియో లోకేశ్ కి ఎలా వచ్చిందో ఇంతవరకూ చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారు.

కేసులు, గొడవలు మాకు కొత్త కాదు.. మరింత రాటుదేలుతాం- అంబటి రాంబాబు

Ambati Rambabu : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. పిన్నెల్లిని వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరింతగా రాటుదేలుతాం తప్ప భయపడేది లేదని తేల్చి చెప్పారు. పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యడానికే టీడీపీ అధికారంలోకి వచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. పిన్నెల్లి అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

”పిన్నెల్లి, అతని కుటుంబాన్ని వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈవీఎం ధ్వంసం వీడియో లోకేశ్ కి ఎలా వచ్చిందో ఇంతవరకూ చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత 307 కేసు పెట్టారు. పిన్నెల్లిపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం. కోర్టుకి తీసుకుని వెళ్తుంటే కుమ్మరి శివ అనే టీడీపీకి చెందిన వ్యక్తి దాడికి ప్రయత్నం చేశాడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరింతగా రాటు దేలుతాం తప్ప భయపడం” అని అంబటి రాంబాబు అన్నారు.

కేసులు, గొడవలు మాకు కొత్త కాదు- గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
”పల్నాడులో టీడీపీ అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పోలింగ్ రోజు నుండి మాచర్ల, పిన్నెల్లి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మాచర్లలో పోలీసులు మొదటి నుండి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. Evm ధ్వంసానికి ముందు జరిగిన వీడియోలు ఎందుకు విడుదల చెయ్యడం లేదు? పిన్నెల్లి కుటుంబసభ్యులపై జరిగిన దాడులపై ఇంతవరకూ చర్యలు లేవు. వైసీపీ నేతలపై 307 కేసులు. టీడీపీ నేతలపై చిన్న చిన్న కేసులు. పల్నాడులో మాకు కేసులు, గొడవలు కొత్త కాదు. ధైర్యంగా ఎదుర్కొంటాం.”

కేసులపై న్యాయపోరాటం చేస్తాం- కాసు మహేశ్ రెడ్డి
పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యడానికే టీడీపీ అధికారంలోకి వచ్చినట్టు వ్యవహరించింది. పోలీసుల అధీనంలో ఉన్న పిన్నెల్లిపై దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. ఈవీఎం ధ్వంసం కేసులో రాత్రే పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పిన్నెల్లిపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..