MLA Shilpa Chakrapani Reddy: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మళ్లీ క‌రోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

MLA Shilpa Chakrapani Reddy: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్

Mla Shilpa Chakrapani Reddy

Updated On : January 12, 2022 / 9:50 AM IST

MLA Shilpa Chakrapani Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మళ్లీ క‌రోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. సామాన్యుల‌ నుంచి సెలబ్రిటీల వరకు వదిలేదే లే అంటూ.. మరోసారి కమ్మేస్తోంది మహమ్మారి.

ముఖ్యంగా మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే ప‌లువురు మంత్రి కొడాలి నాని క‌రోనా బారిన పడగా కర్నూలు జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌ రాగా.. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. తనను కలిసినవారు కరోనా జాగ్రత్తలు పాటించాలని, టెస్ట్ చేయించుకోవాలని కోరారు చక్రపాణిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 36,452 శాంపిల్స్ పరీక్షించగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ యాక్టీవ్ కేసుల సంఖ్య 7,195కి చేరింది.