వంశీకృష్ణను మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా: పవన్ కళ్యాణ్

యువరాజ్యంలో ఉన్న నేతలు ప్రస్తుతం బలమైన నేతలుగా ఎదిగారు. ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం ఉంటుంది. 

వంశీకృష్ణను మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా: పవన్ కళ్యాణ్

YSRCP MLC Vamsi Krishna Srinivas Yadav join Janasena Party

Updated On : December 27, 2023 / 4:30 PM IST

Pawan Kalyan: జనసేన భవిష్యత్తులో కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ధేశించేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీలో చేరారు. జనసేన కండువా వేసి ఎమ్మెల్సీ వంశీని పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ”జనసేన పార్టీలోకి వంశీకృష్ణను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. యువరాజ్యంలో ఉన్న నేతలు ప్రస్తుతం బలమైన నేతలుగా ఎదిగారు. ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం ఉంటుంది. బలమైన వ్యక్తులు రాష్ట్ర స్ధాయిగా ఎదగాలి. మంచి భవిష్యత్తు వేసే విధంగా‌ నిర్మాణాత్మకమైన పాత్ర ఉంటుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీకి అండగా‌ నిలబడ్డారు.. కాని ఏం అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు” అని అన్నారు.

Also Read: ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

వైసీపీకి రిజైన్ చేశా.. ఇక పవన్ వెంటే: వంశీకృష్ణ
కొన్ని శక్తుల కుయుక్తుల కారణంగానే వైసీపీని వీడానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అన్నారు. పవన్ కల్యాణ్ అభిమానిని జనసేనలోకి వచ్చానంటే సొంత కుటుంబంలోకి వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినని, ప్రజారాజ్యం పార్టీలో కష్టపడి పనిచేశానని తెలిపారు. ”వైసీపీకి రిజైన్ చేశాను. వైసీపీకి ఏ విధంగా పనిచేశానో జనసేన బలోపేతానికి అంతకన్నా కష్టపడి పనిచేస్తాను. వైసీపీలో ఎంతో కష్టపడ్డాను. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడిని. కొన్ని శక్తుల కుయుక్తుల వలన వైసీపీని వీడాను. పవన్ తో పాటే ఇక నడుస్తాను. రానున్న రోజుల్లో చాలామంది జనసేనలో చేరనున్నారు. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటున్నట్టుగానే నేనూ కోరుకుంటున్నా. నేను పవన్ కల్యాణ్ అభిమానిని, ఇక పార్టీ మారే అవకాశం లేద”ని వంశీకృష్ణ అన్నారు.