వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం విజయవాడ ACB కోర్టు మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
వాదనలు ఇలా..
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్‌పై విజయవాడ ACB కోర్టు మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ముందు ఇరుపక్షాల వాదనలు జరిగాయి. రిమాండ్ విధిస్తే మెరుగైన వైద్య సదుపాయాల నిమిత్తం నెల్లూరు లేదా రాజమండ్రి జైలుకు తీసుకెళ్లాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు జడ్జికి విన్నవించారు. మిథున్ రెడ్డి రిమాండ్ పై అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు.
మిథున్ రెడ్డి ECG హెల్త్ రిపోర్ట్స్ బాగోలేవని, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని కోర్టుకు సమర్పించలేదని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అన్నారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ఆదేశించింది. కాగా, ఇంటి భోజనంతో పాటు, ప్రైవేటు హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం పిటిషన్ వేయాలని జడ్జి సూచించారు.
చంద్రబాబు హయాంలోనే కొత్త మద్యం బ్రాండ్‌లు: అనిల్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతోనే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ అనిల్ మీడియా సమావేవంలో మాట్లాడుతూ.. కూటమి పాలనలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారని తెలిపారు. 2014-2019 హయాంలో చంద్రబాబు లిక్కర్ స్కామ్ చేశారని అన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ హయాంలో మద్యం షాపులను తగ్గించి ఆదాయం పెంచారని చెప్పుకొచ్చారు.