Buddha Venkanna : చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం, లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం : బుద్ధా వెంకన్న

భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకటానికి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా టీడీపీలో ఎటువంటి విభేధాలు లేవని నిరూపించే యత్నంలో నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. లోకేశ్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

Buddha Venkanna :  చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం, లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం : బుద్ధా వెంకన్న

Yuvagalam Padayatra

Updated On : August 17, 2023 / 3:41 PM IST

Yuvagalam Padayatra preparatory meeting : యువగళం యాత్రలో లోకేశ్ ఉత్సాహంగా ముందుకుసాగిపోతున్నారు. ఎంతోమందిని కలుస్తు..ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలకు సవాళ్లు విసురు కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర అమరావతి జిల్లాల్లో కొనసాగుతోంది. లోకేశ్ పాదయాత్రకు ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈక్రమంలో లోకేశ్ పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించనుంది. దీంతో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న నివాసనంలో టీడీపీ నేతలు యుగవగళం పాద్రయాత్ర స్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గద్దెరామ్మోహన్,వెంకన్న, నాగూల్ మీరా, కేశినేని చిన్నితో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతు..భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశామని ఎవరైనా వాటిని తొలగిస్తే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని అన్నారు. పోలీసులు, అధికారులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కానీ వాటిని అధిగమించి తాము అనుకున్న ఏర్పాట్లతో లోకేశ్ కు ఘన స్వాగతం పలుకుతామని స్పష్టంచేశారు.

JC Prabhakar Reddy : ప్రహరిగోడ కట్టలేని ఎమ్మెల్యే తాడిపత్రికి ఏం చేస్తాడు? : జేసి ప్రభాకర్ రెడ్డి

చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం..లోకేశ్ మాటకు మాట సమాధానం చెప్పే తీరుతో పాదయాత్రలో ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి విజయవంతంగా ముందుకెళుతున్నారని అన్నారు.కృష్ణాజిల్లా టిడిపిలో గ్రూపులున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని తామంతా కలిసి మెలిసి పనులు చేసుకుంటున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా టిడిపి నేతలంతా కలిసికట్టుగా లోకేష్ కి ఆహ్వానం పలుకుతామని స్పష్టంచేశారు.గన్నవరం టీడీపీ కంచుకోట వల్లభనేని వంశీకి బుద్ధి చెప్పే విధంగా మా సభ ఉండబోతుందన్నారు. విజయవాడ సిటీలో మూడు సీట్లు టీడీపీ గెలవబోతోంది అంటూ ధీమా వ్యక్తంచేశారు.విజయవాడ పశ్చిమ సీటు విషయంలో అధినేత చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు బుద్ధా.

ఈ సమావేశంలో పాల్గొన్న కేశినేని శివనాధ్ మాట్లాడుతు..నారా లోకేష్ యువగళం పాదయాత్ర 19న మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందని..విజయవాడ సిటీతో పాటు గన్నవరం బహిరంగ సభను లక్షలాది మందితో నిర్వహిస్తామని తెలిపారు. లోకేష్ పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎవరిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు పెద్ద చిన్న అందరు పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభతో టీడీపీ సత్తా ఉంటో తెలియజేయాలన్నారు.

Andhra Politics: త్రిశూల వ్యూహంతో కాకపుట్టిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్!