ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్.. మే 13 పోలింగ్..

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26న, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29 వరకు..

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్.. మే 13 పోలింగ్..

AP Elections 2024AP Elections 2024

Updated On : March 30, 2024 / 7:06 PM IST

లోక్‌సభతో పాటు ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు.

  • షెడ్యూల్ ఇదే..
AP Elections 2024

AP Elections 2024

  • నోటిఫికేషన్ ఏప్రిల్ 18
  • నామినేషన్ దాఖలు కి చివరి తేదీ ఏప్రిల్ 25
  • నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29
  • ఓటింగ్ మే 13
  • ఎన్నికల ఫలితాలు జూన్ 4
  • జూన్ 6 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి

Read Also: ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఓట్ల కౌంటింగ్ జూన్ 4న

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఏవైనా చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.

కాగా, మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల గురించి పూర్తి వివరాలు తెలిపారు.

  • ఏపీలో మొత్తం ఓటర్లు.. 4,09,37,352
  • పురుషులు .. 2,00,84,276
  • స్త్రీలు.. 2,08,49,730
  • థర్డ్ జండర్… 3,346
  • సర్వీస్ ఓటర్లు.. 67,393
  • పిడబ్ల్యుడి ఓటర్లు.. 5,17,140
  • ఎన్ఆర్ఐ ఓటర్లు… 7,763
  • 18-19 వయసు ఓటర్లు.. 9,01,863
  • 85 + వయసు ఓటర్లు.. 2,12,237
  • పోలింగ్ స్టేషన్స్.. 46,165