Cm Jagan : వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించండి.. డిప్యూటీ సీఎం చేస్తా- పిఠాపురంలో జగన్ కీలక ప్రకటన
పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే అని హెచ్చరించారు.

Cm Jagan : పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం జగన్ కోరారు. వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎంని చేస్తానని హామీ ఇచ్చారు జగన్.
”వంగా గీత నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్నా.. బ్రహ్మాండమైన మెజారిటీతో నా తల్లి, అక్కను గెలిపించండి. మీ అందరికి మీ బిడ్డ మాటిస్తున్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా. మీ కోసం, మీ అందరికి మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకుని మీ అందరికి మంచి చేయిస్తాడు మీ బిడ్డ” అని సీఎం జగన్ అన్నారు.
ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించేవి అని సీఎం జగన్ అన్నారు. కేవలం 36 గంటలు మాత్రమే ఉంది.. కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది అని జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన 99శాతం హామీలు అమలు చేశామన్నారు జగన్. ప్రతి ఒక్కరూ బాగా ఆలోచన చేసి ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే అని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైసీపీకే ఓటు వేయాలన్నారు.
Also Read : నాకు పార్టీలతో సంబంధం లేదు.. శిల్పా రవి కోసమే వచ్చాను.. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్..