Ips Ias Transfers : ఏపీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై ఈసీ కొరడా.. వారిపై బదిలీ వేటు

బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Ips Ias Transfers : ఏపీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై ఈసీ కొరడా.. వారిపై బదిలీ వేటు

Ias Ips Transfers In AP

Ips Ias Transfers : ఎన్నికల వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి వారిని బదిలీ చేయాలని రాష్ట్ర సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. బదిలీ అయిన వారిలో ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లు ఉన్నారు.

ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. వీరిలో ఎస్పీలు పరమేశ్వర్ (ప్రకాశం), రవిశంకర్ రెడ్డి (పల్నాడు), జాషువా (చిత్తూరు), అన్బురాజన్ (అనంతపురం), తిరుమలేశ్వర్ (నెల్లూరు), గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, గౌతమి (అనంతపురం), లక్ష్మీషా (తిరుపతి) ఉన్నారు.

వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ, డీజీపికి పంపారు ఏపీ సీఈవో. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర సీఈవో ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?