Janasena : మచిలీపట్నం నుంచి నాగబాబు, అవనిగడ్డ నుంచి బాలశౌరి? చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం?

తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Janasena : మచిలీపట్నం నుంచి నాగబాబు, అవనిగడ్డ నుంచి బాలశౌరి? చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం?

Janasena : ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు పవన్ కల్యాణ్. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాలశౌరి ఉంటారని భావించారు. అయితే, ఆఖరి నిమిషంలో పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థులకు సంబంధించి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మొదటి నుంచి బందరు పార్లమెంట్ స్థానానికి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని అంతా భావించారు. జనసేన ఇప్పటికే ఒక ఎంపీ, 18మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. కానీ, అనూహ్యంగా బాలశౌరిని అసెంబ్లీకి పంపుతారు అనే ప్రచారం జరుగుతోంది. అవనిగడ్డకు ఆయన పేరుని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరుని పరిశీలిస్తున్నారు. నాగబాబు అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేస్తారని భావించినా..అనూహ్యంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఆయన మచిలీపట్నం వైపు చూస్తున్నారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోపక్క అవనిగడ విషయంలో చాలామంది పేర్లు ప్రస్తావించారు. ఈ ఉదయం ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించారు. వికృతి శ్రీనివాస్, రామకృష్ణ, బండి రామకృష్ణ.. ఈ మూడు పేర్లతో ఐవీఆర్ఎస్ నిర్వహించారు.

 

Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్‌ సీటు