Chandrababu Election Campaign Schedule : 5 రోజులు 17 నియోజకవర్గాలు.. చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.

Chandrababu Election Campaign Schedule : 5 రోజులు 17 నియోజకవర్గాలు.. చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

Chandrababu Election Campaign Schedule : ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రజల్లో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు నాయకులు. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనానిని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. తాజాగా చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 5 రోజుల్లో 17 నియోజకవర్గాలను చుట్టేసేలా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. సభలు, రోడ్ షోలతో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు.

ఈ నెల 27 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షో లు, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా షెడ్యూల్ రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు స్థానాల్లో బాబు పర్యటిస్తారు. మొత్తం 5 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

 

Also Read : ఆ 6 సీట్లను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకింత తర్జనభర్జన?