ఏపీలో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్‎పై తీవ్ర ఉత్కంఠ

ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి.

ఏపీలో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్‎పై తీవ్ర ఉత్కంఠ

Updated On : June 1, 2024 / 4:29 PM IST

Ap Elections 2024 : ఏపీ సార్వత్రిక ఎన్నికలు కాక రేపుతున్నాయి. రాజకీయ పక్షాల్లో జూన్ 4 టెన్షన్ నెలకొంది. మే 13న పోలింగ్ పూర్తైన నాటి నుంచి ఎంతో ఉత్కంఠగా ఇటు రాజకీయ నాయకులు అటు ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 21 రోజుల ఉత్కంఠకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన కేవలం 2 గంటల్లోనే అధికారంపై తుది తీర్పు దాదాపుగా వెల్లడవనుంది. 21 రోజుల ఉత్కంఠకు మూడు రోజుల్లో తెరపడనున్నప్పటికీ రాజకీయ పక్షాలు మాత్రం లెక్కల్లో మునిగి తేలుతున్నాయి.

అధికార వైసీపీ, కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ అధికారం తమదే అన్న ధీమాతో ఉన్నారు. ఫలితాలు వెలువడటానికి కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికలకు మించి ఈసారి దాదాపు 2శాతం మేర ఓటింగ్ పెరగడంతో అధికార, ప్రతిపక్షాలు విజయం తమదేనన్న లెక్కలు కడుతున్నాయి.

ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి. కొన్ని సర్వేలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండగా, మరికొన్ని సర్వేలు కూటమి విజయం ఖాయం అని చెబుతున్నాయి. దీంతో ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది.

Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?