Ycp Focus On Pithapuram : టార్గెట్ పవన్ కల్యాణ్.. పిఠాపురంపై వైసీపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి ఎంపీ మిథున్ రెడ్డి

పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Ycp Focus On Pithapuram : టార్గెట్ పవన్ కల్యాణ్.. పిఠాపురంపై వైసీపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి ఎంపీ మిథున్ రెడ్డి

Ycp Focus On Pithapuram

Updated On : April 13, 2024 / 4:29 PM IST

Ycp Focus On Pithapuram : పిఠాపురంపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పిఠాపురంలో తాజా పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో విడివిడిగా చర్చిస్తున్నారు మిథున్ రెడ్డి. సర్వేలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, విబేధాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

పిఠాపురంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కాకినాడ జిల్లాపై దృష్టి పెట్టారు. కాకినాడ జిల్లాకు సంబంధించిన వైసీపీ అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థితో కూడా సమావేశం అయ్యారు. వారితో అంతర్గతంగా చర్చలు జరిపారు. పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో డిస్కషన్ చేశారు మిథున్ రెడ్డి. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైసీపీ.

Also Read : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?