Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక విజయాలు..!

ఈ రోజు (గురువారం, నవంబర్ 21, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక విజయాలు..!

Pic Credit @ iStock

Updated On : November 20, 2024 / 6:42 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక మాస బహుళ షష్ఠి సా 5:03, పుష్యమి : మ 3: 35 గురువారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: కుటుంబములో భార్య బిడ్డల మూలకంగా సుఖశాంతులు కలుగును, ప్రతి పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తారు, కీర్తిప్రతిష్ఠలు, దేహారోగ్యములు కలుగును, అన్యస్త్రీ పరిచయ భాగ్యములు కలుగును – లలితాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, కుటుంబములోని వారు ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయుదురు, శత్రువులు మిత్రులుగా మారుతారు, విద్యావంతులకు గౌరవ సన్మానములు పొందుతారు, ఆరోగ్యము కుదుటపడుతుంది – కనకధార స్త్రోత్ర పారయణము చేసిన మంచి ఫలితములు కలుగుతాయి.

మిథున రాశి: పనుల్లో ఆలస్యం, స్త్రీ ద్వార తగాదాలు, మనశ్శాంతి లోపించడం. మనస్తాపము, భయము, మనోవేదన, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం, బంధు విరోధములు, వ్యాపారములలో జాగ్రత్త అవసరము – శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: బుద్ధి చాంచల్యము, రావలసిన బాకీలు వసూలు కాకపోవడం, ప్రయాణముల యందు ఇబ్బందులు, నీచ స్త్రీ మూలక కలహములు, జాయింటు వ్యాపారులతో అదికారుల ఒత్తిడి, ఆరోగ్యము కుదుట పడుతుంది, ఇబ్బందులు – శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమము .

సింహ రాశి: పిత్రార్జితం కలిసి రావటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగు పొరుగు వారితో అనుకూలము, సంతోషముగా ఉంటారు – ఇష్ట దైవము ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశి: బంధు విరోధం, నీచ స్త్రీ మూలక కలహములు, అనవసర విషయాలకు ధనవ్యయము, అపకీర్తి రాకుండా కాపాడు కోవాలి, ఋణ బాధలు, మెసపోవడం, ఎవరిని నమ్మకూడదు, బంధువర్గంలో గౌరము పెరుగును – ఇష్ట దైవ ఆరాధన చేసినచో అంతా మేలు జరుగును.

తులా రాశి: పిత్రార్జితం కలిసి రావడం, మంచి ఉద్యోగము రావడం, ధనలాభము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అన్నదమ్ములతో అనుకూలతలు కలుగును, వివాహ సంబంధము కుదురును, సంతానము ద్వారా శుభవార్తలు, అన్ని పనులలో విజయము, బంధు మిత్రులతో విందు వినో దములతో కాలము గడుపుదురు – శివారాధన చేయటం వల్ల ఇబ్బందులు తొలగి పోతాయి.

వృశ్చిక రాశి: ధన విషయంలో చికాకులు, అకాల భోజనములు, రోగ బాధలు కలుగును, ఉద్యోగాలలో ప్రతికూల, ప్రయాణములు లాభములు, మానసిక వేదనలు, ప్రతి విషయములో విచారములు కలగడం, నమ్మినవారి వలన మోసపోవడం, బంధు మిత్రులతో విరోధములు కలగడం, అనవసరపు విషయములలో జాగ్రత్త అవసరం, వ్యాపారంలో ఇబ్బందులు – అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమైన ఫలితములు కలుగును

ధనస్సు రాశి: ప్రయాణాలలో ఇబ్బందులు, సరైన వసతులు లేకపోవడం, గృహమార్పులు, ఆభరణాలు కొనడం, నూతన వ్యాపారములు, రాజకీయము, స్త్రీలకు ఉన్నత అభిప్రాయములు, ధీర్ఘకాలిక వ్యాధుల వలన ఇబ్బందులు, దేవాలయ దర్శనములు – గణపతి ఆలయ సందర్శన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: బంధువులు, స్నేహితుల ద్వారా ఇబ్బందులు, వస్తువులు కొనగోలు, ఆకస్మిక విజయాలు, ఋణ బాధ విముక్తి, తీర్ధ యాత్రలు, దేవతా కార్యక్రమములు, న్యాయ వ్యవహరులలో విజయం, శుభకార్యాలు, వృత్తి వ్యాపారములలో అభివృద్ధి, కార్యసిద్ది, – శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది.

కుంభ రాశి: మనః శాంతి కలగడం, అధిక ప్రయాణములు, తీర యాత్రలు, నదీస్నానము, ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ప్రయాణములు, ఉదర సంబంధ వ్యాధులు, ఉద్యోగ భద్రత అవసరము, శ్రమకు గుర్తింపు, అనేక మార్గములలో ఆదాయం, పెండింగ్ పనులు అన్నీ వేగంగా పూర్తి అవుతాయి, నూతన ఆభరణములు కొనుగోలు చేయడం, రాజకీయ వ్యవహారములలో జయము, – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.

మీనా రాశి: ధన నష్టం, వృధా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువు కొనుగోలు, స్త్రీల నూతన అవకాశాలు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధి కలగడం, విధ్యార్థులకు అనుకూలము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు. 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956