Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి!

ఈ రోజు (బుధవారము, నవంబర్ 13, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశులa ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి!

Pic Credit @ Adobe Stock

Updated On : November 12, 2024 / 6:48 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక శుక్ల ద్వాదశి, మ : 1-01 రేవతి రాత్రి తె 03-09 బుధవారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: అన్ని విషయములలో శ్రద్ధ అవసరము, ప్రతి పనిలో విజయం సాధించడం, ప్రయాణములలో లాభములు, ఆకస్మిక ధనలాభము, విధ్యార్థులకు ప్రతికూల ఫలితములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్లు, వృత్తివ్యా పారములలో అభివృది, ఇంటి నిర్మాణము, వాహన సుఖము : విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ఆవేశం తగ్గించుకోవాలి, అనవసర నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం, వివాదాలు రాకుండా ఉండాలి, మంచి ఆలోచనలు, ప్రయాణముల వలన లాభములు, వ్యాపారములలో లాభములు, విధ్యార్ధులకు అనుకూలం – విష్ణు స్తోత్ర పారాయణం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

మిథున రాశి: ఉద్యోగలాభం, పనులు వేగవంతగా ఉంటాయి, చిరు వ్యాపారులకు లాభాలు, విదేశీయానం, నూతన వ్యాపారములు ప్రారంభించటం, విద్యార్థులకు అనుకూలము, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరపు రాద్దాంతములు – గకార అష్టోత్తరముతో గణపతిని ఆరాధన చేయవలెను.

కర్కాటక రాశి: పనిలో ఆలస్యము, అధిక ఖర్చులు, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ది, బంధు మిత్రులతో విరోధము, ప్రయాణంలో ప్రమాదములు జరగకుండా జగ్రత్తపడాలి, అనారోగ్యము, పనులు వాయిదాలు పడుతాయి, మానసిక ఆందోళనలు తగ్గిం౦చుకోవాలి, భయము పెరుగుతుంది – శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది

సింహ రాశి: అనారోగ్యము, ప్రయాణములలో గొడవలు, తగాదలు, ధనము ఖర్చు, విపరీతమైన ఆందోళనలు, యాజమాన్యముతో ఇబ్బందులు, వస్తువు కొనుగోలులో తగాదలు, పనులలో ఆలస్యము, ఋణ బాధలు, విందులు వినోదములలో పాల్గోనటం, శుభాకార్యక్ర మముల నిర్వాహణ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శన, భార్యభర్తల మధ్య చికాకులు, సంతానము ద్వారా శుభవార్తలు – శ్రీ లక్ష్మీనరసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కన్యా రాశి: భార్య భర్తల మధ్య విబేధములు, ప్రయాణముల వలన లాభములు, వాహనములు కొనుగోలు చేయడం, దూరపు ప్రయాణములు చేయడం, వస్తువులు అమ్మకాలు, కొనుగోలు చేయడం, తీర్ధయాత్రలు, విద్యార్థులకు అనుకూలము, విందు వినోదములు మాటపట్టింపు దోరణి, బంధు మిత్రులతో వివాదములు, అనారోగ్యము కలగడం, తల్లికి అనారోగ్యము – శివ ఆరాధన వలన శుభం కలుగుతుంది. 

తులా రాశి: ప్రయాణములు చేయడం, ఆకస్మిక ధనలాభం, అనుకున్న పనులు నెరవేరడం, విలువైన వస్తువులు కొనడం, రహస్య విషయములు, అనారోగ్యం, వివాహాది శుభకార్యక్రమములు చేయడం, కోపము, ఆవేశము కలగడం, విద్యపట్ల ఆసక్తి – విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: ఉద్యోగ భద్రత, విపరీతమైన ఆలోచనలు, శుభకార్య నిర్వహణ, ప్రయాణముల వలన లాభములు, వ్యాపారములో లాభములు, విదేశాలకు వెళ్లడం, ప్రమోషన్ల గృహ మరమ్మత్తులు, వాహనములు కొనడం, సరియైన నిర్ణయములు తీసుకోవాలి – శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి: ప్రయాణాలలో ఇబ్బందులు, సరైన వసతులు లేకపోవడం, గృహమార్పులు, ఆభరణాలు కొనడం, నూతన వ్యాపారములు, రాజకీయము, స్త్రీలకు ఉన్నత అభిప్రాయములు, సుదూర ప్రయాణములు, ధీర్ఘకాలిక వ్యాధుల వలన ఇబ్బందులు, దేవాలయ దర్శనములు – గణపతి ఆలయ సందర్శన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: బంధువులు, స్నేహితుల ద్వారా ఇబ్బందులు, వివాహములలో ఆటంకములు, వస్తువులు కొనుగోలు, ఆకస్మిక విజయాలు, ఋణ బాధ విముక్తి, తీర్థ యాత్రలు, దేవతా కార్యక్రమములు,న్యాయవ్యవహరులలో విజయం, శుభకార్యాలు, వృత్తి వ్యాపారములలో అభివృద్ధి, కార్యసిద్ధి – శ్రీ అంజనేయస్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది. 

కుంభ రాశి: వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఇబ్బందులు, ఇతరుల సహకారం, అభివృద్ది, దూర ప్రయాణములు, రోగభయము, నేర్పుతో ఉండిన కష్టమునకు తగిన ఫలితము – లక్ష్మీనరసింహ స్తోత్ర పారము ణము చేయటం వలన శుభం కలుగు తుంది

మీనా రాశి: ఆకస్మిక ప్రయాణములు, స్థానచలనము, గృహంలో మార్పులు, ధనవ్యయము, శుభకార్య సిద్ధి, కోపముతో వివాదములు పెరగడం, వృత్తి వ్యాపారములలో శారీరక శ్రమ అధికం, ఆటంకములతో కూడిన విజయం, సుఖ సంతోషములు, సంతానము ద్వార శుభ వార్తలు వింటారు – శివారాధన వలన శుభములు కలుగుతాయి.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956