Karthika Masam: అక్టోబర్ 31.. కార్తీక మాసం 10వ రోజు.. ఇలా చేస్తే ఆ జబ్బులన్నీ నయం..!
కురుక్షేత్రంలో 3కోట్ల బంగారు నాణెలు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో.. అంత ఫలితం రావాలంటే కార్తీక మాసంలో 10వ రోజు దశమి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చన్నీళ్లతో కార్తీక స్నానం చేయండి.
 
                            
Karthika Masam: కార్తిక మాసంలో 10వ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త సంపదలు చేకూరతాయో, అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చో, కార్తీక మాసంలో 10వ రోజు ఏ కథను వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
కార్తిక మాసంలో 10వ రోజు దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున కార్తీక స్నానం కచ్చితంగా చేయాలి. అదే ప్రత్యేకత. ప్రతిరోజు కార్తీక స్నానం తెల్లవారుజామున చేయటం మంచిదే. సూర్యోదయానికి కనీసం అరగంట ముందు నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేస్తే అది కార్తీక స్నానం అవుతుంది.
అయితే దశమి రోజున చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే.. దశమి రోజు కార్తీక స్నానం చేయటం వల్ల కలిగే ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైనా కార్తీక మాసంలో 10వ రోజు దశమి రోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణెలు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అసలు దానం ఇవ్వటానికి గొప్ప ప్రదేశం అంటే భూమి మీద కురుక్షేత్రం. అలా కురుక్షేత్రంలో అన్ని దానాలకంటే గొప్ప దానం బంగారం దానం. కురుక్షేత్రంలో 3కోట్ల బంగారు నాణెలు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో.. అంత ఫలితం రావాలంటే కార్తీక మాసంలో 10వ రోజు దశమి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చన్నీళ్లతో కార్తీక స్నానం చేయండి.
అలాగే కార్తీక మాసంలో 10వ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏంటేంట.. చాలామందికి దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకోటిస్.. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శీతల సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు చాలామంది ఉంటారు. వారంతా ఆ శీతల సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో 10వ రోజు సూర్యాస్తమయం తర్వాత కందిపప్పు, నెయ్యి దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. కందిపప్పు (ఒకటింపావు కేజీ ) ఎర్ర వస్త్రంలో మూట కట్టి, ఆవు నెయ్యి ప్యాకెట్ తో పాటు దానం ఇవ్వాలి. శీతల సంబంధమైన వ్యాధులన్నీ తొలగిపోతాయి. కేవలం ఆవు నెయ్యి దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. తరతరాలు అభివృద్ధి సాధించాలంటే కార్తీక మాసంలో 10వ రోజు అంతే దశమి రోజు కచ్చితంగా ఆవు నెయ్యి ప్యాకెట్ దేవాలయంలో దానం ఇవ్వండి. మీ వంశానికి మంచి అభివృద్ది కలుగుతుంది.






