Karthika Masam: కార్తీక మాసం.. 20వ రోజు.. ఇలా చేస్తే.. సొంతింటి కల తొందరగా సాకారం..! బంగారం కూడా కొంటారు..!

ఇది చాలా అద్భుతమైన స్నానం. మృత్తికా స్నానం ఎలా చేయాలంటే.. దగ్గరలో ఎక్కడైనా..

Karthika Masam: కార్తీక మాసం.. 20వ రోజు.. ఇలా చేస్తే.. సొంతింటి కల తొందరగా సాకారం..! బంగారం కూడా కొంటారు..!

Updated On : November 10, 2025 / 1:00 AM IST

Karthika Masam: కార్తీక మాసం.. 20వ రోజు.. నవంబర్ 10.. సోమవారం.. ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, వినాల్సిన ముఖ్యమైన కథ ఏంటి.. తెలుసుకుందాం..

కార్తీక మాసంలో 20వ రోజు సోమవారం వచ్చింది. కార్తీక బహుళ పంచమి అయింది. కార్తీక బహుళ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో తెలుసుకుందాం.

కార్తీక మాసంలో 20వ రోజున అందరూ కూడా మృత్తికా స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇది చాలా అద్భుతమైన స్నానం. మృత్తికా స్నానం ఎలా చేయాలంటే.. దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉన్నట్లైతే ఆ పుట్ట దగ్గరున్న మట్టిని కొంత సేకరించి ఇంటికి తెచ్చుకోవాలి. పుట్ట చుట్టూ ఉన్న మట్టిని తెచ్చుకుని చేతులు, కాళ్లకు రాసుకుని ఆ తర్వాత స్నానం చేయాలి. దీన్నే మృత్తికా స్నానం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో 20వ రోజు ఎవరైతే ఈ స్నానాన్ని ఆచరిస్తారో వాళ్లు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకుని భూ లాభాన్ని, గృహ లాభాన్ని సిద్ధింప జేసుకోవచ్చు. సొంతింటి కల తొందరగా సాకారం చేసుకోవచ్చు.

ఒకవేళ దగ్గరలో పుట్ట లేకపోతే మృత్తికా స్నానం చేస్తున్నట్లుగా మనసులో భావించుకుంటూ కార్తిక మృత్తికా స్నానం అహంకరిష్యే అనుకుంటూ స్నానం చేయాలి. మృత్తిక అంటే మట్టి అని అర్థం.

ఇలా స్నానం చేసిన తర్వాత శివుడిని సువర్ణ పున్నేరు పూలతో పూజించాలి. గన్నేరు పూలలో సువర్ణ గన్నేరు పుష్పాలు ఉంటాయి. కార్తీక మాసంలో 20వ రోజున ఒక్క సువర్ణ గన్నేరు పువ్వైనా శివుడికి సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగం తొందరగా సిద్ధిస్తుంది. అలాగే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆలయంలో అమ్మవారి ముందు కూర్చుని కార్తీక మాసంలో 20వ రోజున చదవాలి. దాన్ని వసుధా మంత్రం అంటారు. ఈ వసుధా మంత్రం దేవీ భాగవతంతో బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంతిల్లు కొనుక్కోలేని వాళ్లు కార్తిక మాసంలో 20వ రోజున ఆలయంలో అమ్మవారి ముందు కూర్చుని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే కచ్చితంగా 41 రోజుల్లో సొంతింటి కలను నేరవేర్చుకోగలుగుతారు. సొంతింటి కల సాకారం అయ్యే విధంగా అడుగులు పడతాయి. అలాగే ప్రాపర్టీస్ తక్కువ రేటుకు కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్మాలన్నా, గృహ యోగం జీవితంలో అద్భుతంగా కలగాలన్నా ఈ వసుధా మంత్రాన్ని కార్తీక మాసంలో 20వ రోజున అమ్మవారి ఆలయంలో కూర్చుని 108 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే.. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమ:. ఈ మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని చదవాలి. కచ్చితంగా మీక గృహ యోగం కలిగి తీరుతుంది.