Sankashtahara Chaturthi: అక్టోబర్ 10.. సంకష్టహరచతుర్ధి.. ఈ ఫోటోకి ఇలా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..!
అంతేకానీ లక్ష్మి దేవి, గణపతి పక్కపక్కనే ఉంటే దాన్ని లక్ష్మి గణపతి అని అనరు.

Sankashti Chaturthi: అక్టోబర్ 10.. సంకష్టహరచతుర్ధి.. ఆశ్వీజ మాసంలో వచ్చే సంకష్టహరచతుర్ధి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆరోజు గణపతిని పూజిస్తే లక్ష్మి గణపతి అనుగ్రహం వల్ల అష్టఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ధన, కనక, వస్తు ప్రాప్తిని సిద్ధింప జేసుకోవచ్చు. అక్టోబర్ 10న శుక్రవారం ఇంట్లో లక్షీ గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్షీ గణపతి అంటే గణపతి తన ఎడమ ఊరువు (తొడ) మీద తన దేవేరి అయిన సిద్ధి లక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటోను లక్ష్మి గణపతి ఫోటో అంటారు.
అంతేకానీ లక్ష్మి దేవి, గణపతి పక్కపక్కనే ఉంటే దాన్ని లక్ష్మి గణపతి అని అనరు. గణపతి తన ఎడమ తొడ మీద తన భార్య సిద్ధి లక్ష్మిని కూర్చోబెట్టుకుని ఉన్న ఫోటోను లక్ష్మీ గణపతి ఫోటో అంటారు. ఒకవేళ ఇంట్లో ఈ ఫోటో లేకపోతే ఏం చేయాలంటే.. ఏ గణపతి ఫోటోకైనా సరే బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. సహజంగా గణపతికి ఎరుపు రంగు పుష్పాలు అంటే ఇష్టం. కానీ ఆశ్వీజ మాసంలో సంక్షష్టహర చతుర్ధి శుక్రవారం వచ్చింది కాబట్టి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలగాలన్నా, లక్ష్మి గణపతి అనుగ్రహం కలగాలన్నా ఎరుపు రంగు పుష్పాలతో పాటు తెల్లటి పువ్వులతో కూడా గణపతిని పూజించండి.
గణపతిని పూజించేటప్పుడు చదవాల్సిన మంత్రం..
ఓం శ్రీ లక్ష్మి గణపతయే నమ:
రెండో మంత్రం..
నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ:
ఈ రెండు మంత్రాలు చదువుతూ ఎర్ర, తెల్ల పుష్పాలతో పూజ చేయండి. గణపతికి ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టండి. దాంతో పాటుగా తెలుపు పదార్ధాలు అంటే పటిక బెల్లం వంటివి కూడా నైవేద్యంగా సమర్పించండి.
మీకు వీలైతే గణపతి స్వరూపాలలో స్పటిక గణపతి అని ఉంటుంది. తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహం. దీనికి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఎవరైనా సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు, టీవీల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న వాళ్లు, సంగీతంలో మంచి ఛాన్స్ వచ్చి టాప్ కి పొజిషన్ కి వెళ్లాలని చూసే వాళ్లు, నాట్యంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని ఆలోచన చేసే వారంతా కూడా ఆశ్వీజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్ధి శుక్రవారంతో కలిసి వచ్చింది. కాబట్టి స్పటిక గణపతిని పెట్టుకుని తెల్ల పువ్వులతో పూజ చేయాలి. తెల్లటి పదార్ధాలు నైవేద్యంగా పెట్టాలి.
అయితే స్పటిక గణపతి అందుబాటులో లేకపోతే ఏం చేయాలి?
ఏ గణపతికైనా తెల్లటి పువ్వులతో పూజ చేయండి. తెల్లటి పదార్ధాలు నైవేద్యంగా సమర్పించండి.
అలాగే సాయంకాలం పూట వీలైతే గణపతి ఆలయానికి వెళ్లి ఆవు పాలతో, ఆవు పెరుగుతో వెన్నతో ఈ పదార్ధాలు వేటితో అయినా అభిషేకం చేయించుకోండి. పంచాదర కలిపిన జలాలతో అయినా అభిషేకం చేయించుకోండి. దాని వల్ల సమస్త శుభాలు చూకూరతాయి.