Powerful Remedies: మీ కష్టానికి తగిన ఫలితం తొందరగా రావాలంటే.. శక్తివంతమైన పరిహారాలు మీ కోసం..!
భ్రమరాంబ అష్టకం. ఇది చాలా శక్తిమంతమైనది. 40 రోజుల పాటు చదివితే కష్టానికి తగిన ఫలితం తొందరగా వస్తుంది.

Powerful Remedies: మీరు బాగా కష్టపడుతున్నా ఫలితం తొందరగా రావడం లేదా? ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? మీ కష్టానికి, శ్రమకి తగిన ఫలితం తొందరగా రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య కష్టానికి తగిన ఫలితం, శ్రమకు తగిన ఫలితం రాకపోవటం. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. లైఫ్ లో గ్రోత్ లేకపోవడం. అలాంటి వాళ్లు లైఫ్ లో తొందరగా ఎదగాలంటే, కష్టానికి తగిన ఫలితం రావాలంటే పరిహారం శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి.
శక్తివంతమైన పరిహారాలు..
* మీ ఇంట్లో క్షీర సాగర మదనం ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది. ఆ క్షీర సాగర మదనం ఫోటోని హాల్ లో పెట్టుకుని దానికి నమస్కారం చేసుకుని ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్లండి. కష్టానికి తగిన ప్రతిఫలం తొందరలోనే లభిస్తుంది.
* ఇంట్లో పూజ గదిలో స్పటిక లింగం పెట్టుకుని బిల్వ దళాలతో రోజూ పూజ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్న వారి ఇంట్లో ఉన్నవారికి కష్టానికి తగిన ఫలితం తొందరగా వస్తుంది.
* భ్రమరాంబ అష్టకం. ఇది చాలా శక్తిమంతమైనది. 40 రోజుల పాటు చదివితే కష్టానికి తగిన ఫలితం తొందరగా వస్తుంది.
శివాలయంలో ప్రత్యేక పదార్ధం పంచి పెట్టాలి..
* సోమవారం శివాలయంలో ప్రత్యేక పదార్ధం పంచి పెట్టాలి. అదే బెల్లం పొంగలి. ఈ బెల్లం పొంగలి తయారు చేసేటప్పుడు నూనె కాకుండా నెయ్యి వాడాలి. చక్కెర కాకుండా బెల్లం వాడాలి. అప్పుడే అది శక్తిమంతమైన పరిహారం అవుతుంది.
* ఇలా 5 సోమవారాలు శివాలయం ప్రాంగణంలో భక్తులకు బెల్లం పొంగలి పంచి పెట్టాలి. అది కూడా ఆవు నెయ్యితో చేసిందే. మీ కర్మ ఫలితాలు తగ్గి కష్టానికి తగ్గ ఫలితం తొందరగా వస్తుంది.
* పరిహార శాస్త్రం ప్రకారం పరిహారాలకు ఎప్పుడూ కూడా పంచదార వాడకూడదు, నూనె, ఎండు మిరపకాయలు వాడకూడదు. బెల్లం, నెయ్యి, పచ్చి మిరపకాయలు మాత్రమే వాడాలి. అప్పుడే పరిహారాలు బాగా పని చేస్తాయి.
* మీ జన్మ నక్షత్రం నాడు పులిహోర పంచాలి. ఆ పులిహోరలో పచ్చి మిరపకాయలే వేయాలి. ఎండు మిరపకాయలు వేయకూడదు. నాలుగుసార్లు జన్మ నక్షత్రం ఉన్నప్పుడు పచ్చి మిరపకాయలు వేసి పులిహోర చేసి దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. కష్టానికి తగ్గ ఫలితం తొందరలోనే వస్తుంది.
* జన్మ నక్షత్రం రోజున దేవాలయం ప్రాంగణంలో శనగలు దానం ఇవ్వాలి. లేదా తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచి పెట్టాలి.
తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన వారి దగ్గరికి వెళ్లాలి..
* తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన వారి దగ్గరికి వెళ్లి, వారికి పసుపు రంగులో ఉన్న పండ్లు ఇచ్చి రావాలి. అలా చేస్తే ఆ తీర్థయాత్ర ఫలితంలో కొంత భాగం మీకూ వస్తుంది. కర్మ ఫలితాలు తగ్గి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. జీవితంలో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది.
* శుక్రవారం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదా యజమానురాలు తులసి కోట దగ్గర ఒక ఉసిరికాయ ఉంచాలి. ఉసిరికాయపైన పెచ్చు తీయాలి. వత్తులు ఆవు నెయ్యిలో తడిపి ఉసిరికాయపై వేసి దీపం పెట్టాలి.