Horoscope Today : ఈ రాశి వారు నక్కతోక తొక్కినట్టే.. ఊహించని లాభం..!

రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

Horoscope Today : ఈ రాశి వారు నక్కతోక తొక్కినట్టే.. ఊహించని లాభం..!

Horoscope Today

Updated On : March 26, 2025 / 12:48 AM IST

Horoscope Today : గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలు ఉన్నవారు కొన్ని లాభాలు అందుకుంటారు. మేషం, సింహం, మీన రాశుల వాళ్లు మానసిక సంఘర్షణకు గురవుతారు. మిథున రాశివారు ఈ రోజు నక్క తోక తొక్కినట్టే! ఊహించని లాభాలు అందుకుంటారు.

Aries

Aries

మేషం: కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆత్మీయుల సలహాలు పాటించండి. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. స్త్రీ మూలకంగా ధననష్టం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Taurus

Taurus

వృషభం: శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఆదాయం లభిస్తుంది. పట్టుదలకు వెళ్లకండి. పెద్దల దగ్గర తగ్గి ఉండటం ఈ రోజు అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. అన్నదమ్ముల వల్ల అదృష్టం పలకరిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

Gemini

Gemini

మిథునం: ఈ రోజు ఓ కీలకమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అది మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లిదండ్రులతో సరదాగా సంభాషిస్తారు. వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాలభైరవ ఆరాధన శుభప్రదం.

Cancer

Cancer

కర్కాటకం: మంచి ఆలోచనలు అమలు చేస్తారు. తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందుతారు. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

Leo

Leo

సింహం: ఆలోచనలు అమలుచేయడంలో ఆలస్యం జరుగుతుంది. పెద్దల సహకారం తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Virgo

Virgo

కన్య: రావలసిన డబ్బు అందుతుంది. చక్కటి సంగీతం వింటారు. పిల్లలతో సరదాగా కాలం గడుపుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు కాస్త ఆచితూచి వ్యవహరించడం అవసరం. సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. వినాయకుడి గుడికి వెళ్లండి.

Libra

Libra

తుల: కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతాయి. గురువు అనుగ్రహం ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోండి.

Scorpio

Scorpio

వృశ్చికం: అనుకోని అవాంతరాలు చుట్టుముడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉండకండి. సమయపాలన పాటించడం అవసరం. షేర్‌ మార్కెట్‌ లావాదేవీల్లో అజాగ్రత్త వద్దు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

Sagittarisu

Sagittarisu

ధనుస్సు: రవి, కుజులు మేలు చేస్తున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రాబడి పెంచుకోవడంపై దృష్టి సారిస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలం. మూల నక్షత్రం గలవారికి మరింత మేలు జరుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

Capricorn

Capricorn

మకరం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం సూచితం. ఉద్యోగులకు ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. సమయపాలన పాటించడం అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

Aquarius

Aquarius

కుంభం: ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎలాంటి సవాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు. అయితే, అత్యుత్సాహం కూడదు. మాటల్లో పొదుపు అవసరం. పనిలో చేవ చూపితే.. ఈ రోజంతా మీదే! ధన లాభం సూచితం. సమయోచితంగా వ్యవహరిస్తారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Pisces

Pisces

మీనం: మీ ఓపికకు పరీక్షలు ఎదురవుతాయి. చాలా తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది. పట్టువిడుపులు ప్రదర్శిస్తే.. కార్యం సఫలం అవుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సూర్యారాధన శుభప్రదం.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.