Mithuna Rashi Ugadi Rasi Phalalu 2025 : మిథునం రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
కుటుంబంతో కాలం సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Gemini
Mithuna Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
మిథునం
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 2
రాజపూజ్యం: 4 అవమానం: 3
చైత్రం: కుటుంబంతో కాలం సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వైశాఖం: బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నెల చివరిలో ఊహించని విధంగా లబ్ధి చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించండి.
జ్యేష్ఠం: విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ప్రారంభించిన పనులు నిదానంగా సాగు-తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కీలక పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరి-స్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
శ్రావణం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. గతంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
భాద్రపదం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.
ఆశ్వయుజం: నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధిపథంలో కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతి, స్థానచ-లనం ఉండవచ్చు. నలుగురికి సాయపడతారు.
మార్గశిరం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: ఈ నెలలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసు-లలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
మాఘం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయోచిత నిర్ణ-యాలు తీసుకొని సత్ఫలితాలను పొందుతారు. సహోద్యోగుల సహకారం లభి-స్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఫాల్గుణం: పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అదృష్టం కలిసివస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయడంలో విజయం సాధిస్తారు.