Tula Rashi Ugadi Rasi Phalalu 2025 : తుల రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులు అనుకూల నిర్ణయాలతో లాభాలను పొందుతారు.

Tula Rashi Ugadi Rasi Phalalu 2025 : తుల రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

Libra

Updated On : March 30, 2025 / 12:48 AM IST

Tula Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్‌ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.

అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్‌ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

తుల
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 2 అవమానం: 2
చైత్రం: పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, ఆత్మీ-యుల సహకారంతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు పనులు అనుకూలిస్తాయి.
వైశాఖం: ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపా-రాల్లో సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమి-త్రులను కలుసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
జ్యేష్ఠం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులు అనుకూల నిర్ణయాలతో లాభాలను పొందుతారు. ఆదాయం పెరు-గుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
ఆషాఢం: ప్రారంభంలో అనుకూలంగా ఉంటూ, చివరిలో ప్రతికూలత ఎదురవు-తాయి. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.
శ్రావణం: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూములు, వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. రావల-సిన డబ్బు చేతికి అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది.
భాద్రపదం: స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో తోటి వారితో సమస్యలు ఏర్పడతాయి. కానీ అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సా-హంతో పనులు చేస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపా-రాలు లాభసాటిగా కొనసాగుతాయి.
కార్తికం: విద్యార్థులు చదువులో మంచి ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.
మార్గశిరం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవే-రుతాయి. స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.
పుష్యం: జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో పనులు చేయాలి. సంయమనంతో ముందడుగు వేయాలి. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మాఘం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సహాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. స్థిర, చరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి.