Vastu Shastra Tips : అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ బెస్ట్ హోం పెయింటింగ్స్ మీకోసం.. ఇక మీ ఇంట్లో డబ్బేడబ్బు..!
Vastu Shastra Tips : అదృష్టం పట్టాలన్నా డబ్బులు దండిగా వచ్చి పడాలన్నా మీ ఇంట్లో ఈ బెస్ట్ పెయింటింగ్స్ పెట్టుకోండి చాలు.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏయే వాల్ పెయింటింగ్స్ పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం..

vastu shastra tips to place 7 best paintings
Vastu Shastra Tips : కొత్త ఇల్లు కొన్నారా? లేదా ఏదైనా కొత్త అద్దె ఇంటికి మారుతున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. ఏ ఇంటికి అయినా కచ్చితంగా వాస్తు ఉండాల్సిందే. ఆ వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. అప్పుడే అంతా శుభం కలుగుతుందని, అదృష్టం వరిస్తుందని, లక్ష్మీదేవీ అనుగ్రహంతో డబ్బులు దండిగా వస్తాయని నమ్ముతుంటారు.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ప్రతిఒక్కరూ తాము ఉండే ఇల్లు సొంతమైనా లేదా అద్దె ఇల్లు అయినా తప్పనిసరిగా వాస్తు నియమాలనుసరించి అన్ని వస్తువులను చక్కబెట్టుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని చెబుతారు.
Read Also : Vastu Shastra Tips : ఈ రెండు దిశలలో మొక్కలు ఎందుకు ఉంచకూడదో తెలుసా? వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే?
చాలామంది తమ ఇంటిని అందంగా అలకరించేందుకు ఎన్నో వస్తువులను తెచ్చిపెడుతుంటారు. అందులో వాల్ పెయింటింగ్స్ ఒకటి. అందులో కొన్ని బెస్ట్ వాల్ పెయింటింగ్స్ మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ గది అందంతో పాటు వాస్తుప్రకారం.. డబ్బు, చదువు, ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు ఆ బెస్ట్ పెయింటింగ్స్ ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
మీ ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి అత్యుత్తమ పెయింటింగ్ ఉంచేందుకు ఈ వాస్తు శాస్త్రపరమైన చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. వాస్తుశాస్త్రం అనేది సామరస్య పూర్వకమైన, సంపన్నమైన సమతుల్య జీవన ప్రదేశాలను రూపొందించేందుకు ఉపయోగించే పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రంగా చెబుతారు.
బుద్ధుని పెయింటింగ్ :
మీ ఇంటి ప్రధాన ద్వారం వైపు బుద్ధుని పెయింటింగ్ ఉంచడం వల్ల మీ ఇంటికి శాంతి, ప్రశాంతత ఆకర్షిస్తుంది.
ఏడు గుర్రాలు :
మీ గదిలో దక్షిణ గోడపై ఏడు గుర్రాల పెయింటింగ్ ఉంచడం వల్ల మీకు అన్నింటా విజయం, శక్తి, ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది.
వాటర్ పెయింటింగ్ :
మీ ఇంటి గదిలో నీటి పెయింటింగ్ ఉంచడం వల్ల భావోద్వేగ ప్రవాహాన్ని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపించి మంచి ఆలోచనలను కలిగేలా చేస్తుంది.
మనీ పెయింటింగ్ :
వాస్తు ప్రకారం.. మీరు కోరుకున్న స్థలంలో డబ్బు కలిగిన పెయింటింగ్ ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తుంది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.
Read Also : Vastu Shastra : వాస్తుశాస్త్రం ప్రకారం.. ఈ 8 వస్తువులను ఎప్పుడూ ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వకూడదు..!
జంట పక్షులు :
జంట పక్షులు ఉన్న ఏదైనా ఒక పెయింటింగ్ కూడా మీ ఇంటి గదిలో ఉంచాలి. అది మీ ఇంట్లో ప్రేమసంబంధాలను బలపడేలా చేస్తుంది. కుటుంబ సభ్యులతో సామరస్య శక్తిని పెంపొందిస్తుంది.
కళాఖండాల పెయింటింగ్ :
మీ ఇంట్లో కళాఖండాలను ఉంచడం వల్ల ఆ గదిలో అందంతో పాటు చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే అందంతో పాటు మంచి పాజిటివిటిని కూడా తీసుకువస్తాయి.
రంగురంగుల పెయింటింగ్స్ :
మీ ఇంటి గదిలో ఎక్కడైనా గోడకు రంగురంగుల పెయింటింగ్స్ ఉంచండి. అది మీ ఇంటికి మంచి అందంతో పాటు ప్రకాశాన్ని కూడా తీసుకువస్తుంది. ఆ ఇంట్లోని వారికి మనస్సు ఉత్సాహభరితంగా ఆహ్లాదకరమైన వాతావారణాన్ని సృష్టిస్తాయి.