2024 Hyundai Creta Facelift : 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వచ్చేది ఎప్పుడంటే? కొత్త కారు ఫొటోలు ఇవే..!
2024 Hyundai Creta Facelift : భారత మార్కెట్లోకి కొత్త కారు వచ్చేస్తోంది. ఈ కొత్త ఏడాదిలో జనవరి 16న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు లాంచ్ కానుంది. దీనికి ముందే కారు ఫొటోలు రివీల్ అయ్యాయి.

2024 Hyundai Creta Facelift fully revealed in new images
2024 Hyundai Creta Facelift : 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ జనవరి 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారుకు సంబంధించిన ఫొటోలు రివీల్ అయ్యాయి. కొత్త అప్‌డేటెడ్ అవతార్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, రాబోయే టాటా కర్వ్‌వి వంటి వాటితో పోటీపడుతుంది.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ఇప్పటికే రూ. 25వేల టోకెన్ మొత్తానికి ఓపెన్ అయ్యాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల రేంజ్‌లో ఉంటుందని భావించవచ్చు. సూచన కోసం.. హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీ 2023లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా 113,387 యూనిట్లు, కియా సెల్టోస్ 104,891 యూనిట్లతో పోల్చితే.. 157,311 యూనిట్ల విక్రయాలను సాధించింది.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ట్రనల్ అప్‌డేట్‌లను పొందింది. కొత్త పారామెట్రిక్ బ్లాక్ క్రోమ్, క్వాడ్-బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ హోరిజోన్ పొజిషనింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ కనెక్ట్ చేసిన ఎల్ఈడీ హోరిజోన్ టెయిల్-ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ స్టాప్ ల్యాంప్‌తో కూడిన స్పాయిలర్, రీడిజైన్ చేసిన టెయిల్‌గేట్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Hyundai Creta Facelift
2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ :
క్రెటా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ పూర్తిగా రీడిజైన్ అయింది. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాల), డిజిటల్ క్లస్టర్ (10.25-అంగుళాల)తో కొత్త డ్యాష్‌బోర్డ్ ఉంది. కొత్త లెథెరెట్ సీట్లు, లెథెరెట్ డోర్ ఆర్మ్‌రెస్ట్ కవరింగ్, లెథెరెట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెథెరెట్-ర్యాప్డ్ గేర్ షిఫ్టర్, యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 8-వే పవర్ డ్రైవర్ సీటు, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, డ్యూయల్-జోన్ ఉన్నాయి. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, 8 స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంటాయి.
2024 హ్యుందాయ్ క్రెటా సేఫ్టీ :
క్రెటా ఫేస్‌లిఫ్ట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి 36 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌లతో సహా 70కి పైగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. టాప్-స్పెషిఫికేషన్ల వేరియంట్‌లు 19 ఫీచర్లతో లెవల్ 2 అడాస్ (హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్)ని పొందుతాయి.

2024 Hyundai Creta Facelift new images
2024 హ్యుందాయ్ క్రెటా ఇంజన్ & ట్రాన్స్‌మిషన్ :
మీరు క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో మూడు ఇంజన్ ఆప్షన్‌లను పొందుతారు. 1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్ (115పీఎస్, 144ఎన్ఎమ్), 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ (160పీఎస్, 253ఎన్ఎమ్), 1.5-లీటర్ యూ2 సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్ ఉంటాయి. నాలుగు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. 6-స్పీడ్ ఎంటీ , ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లు ఉన్నాయి.
1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీతో రావచ్చు. 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీని మాత్రమే పొందుతుంది. 1.5-లీటర్ యూ2 సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లను కలిగి ఉంది.

2024 Hyundai Creta Facelift
2024 హ్యుందాయ్ క్రెటా ట్రిమ్స్ & వేరియంట్‌లు :
క్రెటా ఫేస్‌లిఫ్ట్ కార్లలో ఇ, ఇఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ) ఏడు ట్రిమ్‌లను కలిగి ఉంది. 28 విభిన్న ట్రిమ్, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌లు ఉన్నాయి.