భారత్‌లో 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ లాంచ్.. రూ.1.50 లక్షలకే.. ఎలా ఉందంటే?
రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ వంటి మూడు కొత్త కలర్లలో ఈ బైకులు లాంచ్ అయ్యాయి.

భారత్‌లో 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ శనివారం లాంచ్ అయింది. ముంబై, న్యూఢిల్లీలో జరిగిన హంటర్‌హుడ్ ఫెస్టివల్ సందర్భంగా దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు. దీని ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్‌లో) నుంచి ప్రారంభం అవుతోంది.
కొత్త ఫీచర్లు ఏమున్నాయి?
రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ వంటి మూడు కొత్త కలర్లలో ఈ బైకులు లాంచ్ అయ్యాయి. లీనియర్ స్ప్రింగ్స్ స్థానంలో ప్రోగ్రెసివ్ స్ప్రింగ్స్‌తో ఈ బైకును అప్‌గ్రేడ్ చేశారు. దీంతో మరింత సౌకర్యంగా రైడ్ చేయవచ్చు. ఎగ్జాస్ట్ రూటింగ్ రీడిజైన్‌తో గ్రౌండ్ క్లియరెన్స్ 10mm పెరిగింది.
హాలోజన్ యూనిట్ స్థానంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో ఈ బైక్ వచ్చింది. స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో దీన్ని లాంచ్ చేశారు. సీటును కూడా రీడిజైన్ చేశారు. ఇంజన్‌లో మాత్రం మార్పులు లేవు. 349cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ జే-సిరీస్ ఇంజన్, 6,100 rpm వద్ద 20.2 bhp, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
Also Read: టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంఛ్‌కు ముహూర్తం ఫిక్స్
రెట్రో (స్పోక్ రిమ్స్, ట్యూబ్ టైర్లు, రియర్ డ్రమ్ బ్రేక్), మెట్రో డాపర్, మెట్రో రెబెల్ (అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, రియర్ డిస్క్ బ్రేక్) వేరియంట్‌లతో ఈ బైక్ లాంచ్ అయింది. 790mm సీటు ఎత్తు, 181kg కర్బ్ వెయిట్, 13-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో నియో-రెట్రో రోడ్‌స్టర్ స్టైలింగ్ తో ఈ బైక్ వచ్చింది.
డ్యూయల్-ఛానల్ ABS, 300mm ఫ్రంట్ డిస్క్, 270mm రియర్ డిస్క్ (మెట్రో వేరియంట్‌లలో) దీన్ని లాంచ్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో మొదలవుతాయి. ఈ బైక్ హోండా CB350RS, జావా 42, TVS రోనిన్, యెజ్డీ రోడ్‌స్టర్‌లకు పోటీనిచ్చే అవకాశం ఉంది.
ధరలు (ఎక్స్-షోరూమ్)
- రెట్రో (బేస్ వేరియంట్) ధర: రూ.1.50 లక్షలు
- మెట్రో డాపర్ (మిడ్-స్పెక్) ధర: రూ.1.76-1.77 లక్షల మధ్య
- మెట్రో రెబెల్ (టాప్ వేరియంట్) ధర: రూ.1.81-1.82 లక్షల మధ్య