8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. రేపే కీలక నిర్ణయం?
వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై రేపు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రకటన చేశారు.
వేతన సంఘం చేసిన ప్రతిపాదనల మేరకు జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ జీతాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త కమిషన్ ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తారు.
కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయకంగా ప్రతి పదేళ్లకు ఓ సారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2014లో 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది.
కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘ సిఫార్సుల అమలు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏయే ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం.
8వ వేతన సంఘ సిఫార్సుల మేరకు 92-186 శాతం పే హైక్ ఉంటుంది
8వ ఆర్థిక సంఘం 2025 ఫిబ్రవరి 15న ఏర్పాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కమిషన్ నివేదిక నవంబర్ 30 లోపు ఖరారు అవుతుందని చెబుతున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం 2025 ఏప్రిల్‌లో తన పనిని ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు. 8వ ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం చాలా కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రేపటితో వారి ఎదురు చూపులకు తెరపడనుంది.