High Speed Rail: హైస్పీడ్ రైళ్లు.. 2గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు, చెన్నైలకు.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయంటే?

హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

High Speed Rail: హైస్పీడ్ రైళ్లు.. 2గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు, చెన్నైలకు.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయంటే?

High Speed Rail

Updated On : February 14, 2025 / 12:15 PM IST

High Speed Rail: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువే. వీరు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే విమానాన్ని ఆశ్రయించాల్సిందే. హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు విమానంలో వెళితే రెండు గంటల సమయమే పడుతుంది. ఎక్కువ మంది రైల్వే మార్గం ద్వారా బెంగళూరు, చెన్నైలకు చేరుకుంటారు. దీనిద్వారా సమయం వృధా అవుతుంది. రైలులో అయితే దాదాపు 12గంటల సమయం పడుతుంది. అయితే, విమనాంలో కాకుండా.. రైలు మార్గం ద్వారా కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

Also Read: Valentine’s Day 2025 : వాలెంటైన్స్ డే ‘రియల్ హిస్టరీ’ ఏంటో తెలుసా? ఎందుకు జరుపుకుంటారు? ఈ స్పెషల్ డేపై ఆసక్తికరమైన విషయాలివే..!

హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వచ్చింది. ఈ నమూనాతోనే హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లకు ఎఫ్ఎల్ఎస్ (ఫైనల్ లొకేషన్ సర్వే)కు రైల్వే అధికారులు టెండర్లు ఆహ్వానించారు. హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ పొడవు 705 కిలో మీటర్లుగా ప్రతిపాదించగా.. హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ పొడవు 626 కిలో మీటర్లుగా ప్రతిపాదించారు. ఈ హైస్పీడ్ రైలు గంటకు సుమారు 320కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

 

High Speed Rail

రైల్వే అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే కు టెండర్లను ఆహ్వానించారు. దీన్ని రైల్వే బోర్డు ఆమోదిస్తే రాబోయే ఎనిమిదేండ్లలో హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. హైస్పీడ్ రైళ్లు గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. హైస్పీడ్ రైళ్లకోసం ప్రత్యేక ట్రాక్ లను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మొదటి దశలో ఎఫ్ఎల్ఎస్ సర్వే చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఈ సర్వేను కేంద్ర రైల్వే బోర్డుకు పంపిస్తారు. దీన్ని బోర్డు ఆమోదిస్తే భౌగోళికమైన మ్యాపింగ్, భూమి స్వభావంపై పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత బ్రిడ్జింగ్, టెన్నెలింగ్, బిల్డింగ్స్, ఇతర నిర్మాణాలతో సహా వివణాత్మక అంచనాలతో టెండర్లు పిలుస్తారు.

High Speed Rail

విమాన మార్గం ద్వారా హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై రూట్లలో ఎంత సమయం పడుతుందో.. హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకివస్తే దాదాపు అంతే సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు చేరుకోవచ్చు.