భారీ సంక్షోభంలో టెలికాం రంగం : 40వేల ఉద్యోగాలకు ముప్పు

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2019 / 07:38 AM IST
భారీ సంక్షోభంలో టెలికాం రంగం : 40వేల ఉద్యోగాలకు ముప్పు

Updated On : October 30, 2019 / 7:38 AM IST

వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న ఏదైనా ఆపరేటర్లు దివాలా కోసం దాఖలు చేస్తే ఆ సంఖ్య మరింత పెరుగే అవకాశం ఉందని  సిఐఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్,సీఈవో ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కొన్ని కంపెనీలు దివాలా తీయవచ్చని ఆయన తెలిపారు. టెలీకమ్యూనికేషన్స్, టవర్స్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) లను కలిగి ఉన్న ఈ రంగంలో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు.

AGR వివాదం ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలీ కమ్యూనికేషన్స్ యొక్క ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, ఎయిర్‌టెల్ వివాదాస్పద మొత్తంలో 23.4 శాతం (రూ. 21,682 కోట్లు) చెల్లించాల్సి ఉండగా, వోడాఫోన్ ఐడియా చెల్లింపు 30.55 శాతం (రూ. 28,308 కోట్లు)దగ్గర చాలా పెద్దదిగా ఉంటుంది.సుప్రీం తీర్పు యొక్క ప్రభావం చాలా పెద్దదిగా ఉండటంతో ఎయిర్ టెల్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను నవంబర్ 14 వరకు వాయిదా వేయవలసి వచ్చింది.

2016 సెప్టెంబర్‌ రిలయన్స్ జియో ఎంట్రీ తరువాత, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టెలినార్ మరియు ఇతరులు దుకాణాన్ని మూసివేయడంతో ఈ రంగం పరిమాణం 30 శాతానికి పైగా తగ్గిపోయింది. పెద్ద ఎత్తున విలీనాలు, సముపార్జనల వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ రంగం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో ఇటీవలి దెబ్బ వచ్చింది.గత మూడేళ్లలో నియామకం గణనీయంగా తగ్గింది. సీనియర్ స్థాయిలో స్థానాలు భర్తీ చేయబడలేదు. ఈ రంగం ప్రతిభకు ఆకర్షణను కోల్పోయిందని ఓ హెచ్ ఆర్ కన్సల్టెంట్ చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు.. ఇప్పటికే దీర్ఘకాలిక టారిఫ్ వార్, అధిక రుణ భారం తో పోరాడుతున్న కంపెనీల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, జూన్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ 2,392.2 కోట్ల రూపాయల నికర నష్టాలను నమోదు చేసింది. వోడాఫోన్ ఐడియా అదే త్రైమాసికంలో రూ.4వేల 873.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు ఇప్పటికే కొత్తగా వచ్చిన జియోకు 2016లో తగినంత ఇంటర్‌కనెక్ట్ పాయింట్లు ఇవ్వనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) విధించిన రూ.3వేల 050 కోట్ల జరిమానా భారానికే కిందాపైనా పడుతోంది. జూలైలోనే ఐదుగురు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డిసిసి) సభ్యులు ట్రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. కేవలం ఇద్దరు విభేదించారు. దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై ట్రాయ్ జరిమానాకు ఆమోదం తెలిపింది.