జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద.. 6 వారాల్లో ఏడు మెగా డీల్స్

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. అబుదాబికి చెందిన ముబదాలా సంస్థ 9వేల 93 కోట్లు పెట్టుబడి పెట్టి 1.85 వాటాను సొంతం చేసుకుంది. గతంలో పెట్టుబడి పెట్టిన అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రెండోసారి ఇన్వెస్ట్ చేసింది. ఈ సారి భారీ డీల్ కుదుర్చుకుని.. ఏకంగా జియోలో 2.08 శాతం వాటాను కొనుగోలు చేసింది. కేవలం 6 వారాల వ్యవధిలోనే జియో ఏడు భారీ డీల్స్‌ను సొంతం చేసుకుంది. జియోలో ఇప్పటికే 1.15 శాతం వాటాను చేజిక్కించుకుంది. సిల్వర్‌లేక్ వాటాను మరింత పెంచుకుంది.
రెండోసారి భారీగా ఇన్వెస్ట్ చేసింది. తాజాగా మరో రూ. 4వేల 546.80 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 2.08 శాతం వాటాను దక్కించుకుంది. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌లేక్ పెట్టుబడులు 10 వేల 202.55 కోట్లకు చేరుకున్నాయి. RIL సమీకరించిన నిధుల మొత్తం రూ. 92 వేల 202.15 కోట్లకు చేరుకుంది. ఈ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 20 శాతం వాటాలను విక్రయించాలన్న రిలయన్స్ లక్ష్యం కూడా నెరవేరినట్టు అయింది.
జియోలో ఫేస్‌బుక్‌తో ప్రారంభమైన పెట్టుబుడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుస్తున్నారు. ఏప్రిల్ 22 రిలయన్స్ జియో – ఫేస్‌బుక్ 43 వేల 573 కోట్ల విలువైన డీల్ కుదిరింది. జియోలో 9.99 శాతం కొనుగోలు చేసింది ఫేస్‌బుక్. మే 3న రిలయన్స్ జియోలో 1.15 శాతం వాటా కోసం మొదటి సారి 5వేల 656 కోట్లు చెల్లించింది సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్. మే 8న రిలయన్స్ జియోలో 2.32 శాతం వాటా కోసం 11వేల 367 కోట్ల పెట్టుబడి పెట్టింది విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్. మే 17న జనరల్ అట్లాంటిక్ సంస్థ 6వేల 598.38కోట్ల పెట్టుబడి పెట్టి 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. KKR సంస్థ 11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2.32 శాతం వాటాను పొందింది. మొత్తం మీద గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి జియోలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.