AC Discounts Sale : కొత్త AC కొనేవారికి గుడ్ న్యూస్.. ఏసీలపై రూ.4వేల వరకు తగ్గింపు.. జస్ట్ రూ. 1కే ప్రీ-బుకింగ్ చేసుకోండి..

AC Discounts Sale : కేంద్ర ప్రభుత్వం ఏసీలపై జీఎస్టీని తగ్గించింది. కొనుగోలుదారులు ఏసీల కొనుగోలుపై రూ.4వేల వరకు తగ్గింపు అవకాశం ఉంది.

AC Discounts Sale : కొత్త AC కొనేవారికి గుడ్ న్యూస్.. ఏసీలపై రూ.4వేల వరకు తగ్గింపు.. జస్ట్ రూ. 1కే ప్రీ-బుకింగ్ చేసుకోండి..

AC Discounts Sale

Updated On : September 18, 2025 / 2:29 PM IST

AC Discounts Sale : కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత రెయిన్ సీజన్‌లో ఏసీల ధరలు భారీ తగ్గింపుతో లభ్యమవుతున్నాయి. వచ్చే వారం నుంచి జీఎస్‌టి రేట్లు తగ్గింపు అమల్లోకి రానుంది. దాంతో అనేక రూమ్ ఎయిర్ కండిషనర్ (AC) తయారీదారులు, డీలర్లు తక్కువ ధరలకు యూనిట్లను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు.

జీఎస్టీలో 10 శాతం తగ్గింపు మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ఏసీ తయారీదారులు (AC Discounts Sale) ధృవీకరించారు. ఫలితంగా ఏసీ మోడల్‌ను బట్టి యూనిట్‌కు సగటున రూ. 4వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్, ప్రస్తుత 4 పన్ను శ్లాబులను 5 శాతం, 18 శాతం టూ-రేటు స్ట్రక్ష్చర్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఈ మార్పుతో అత్యంత సాధారణ వినియోగ ప్రొడక్టులు అత్యల్ప శ్లాబు కిందకు చేరుతాయి. ప్రస్తుతం, ఏసీలపై 28 శాతం పన్ను విధిస్తోంది. కానీ, కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నవరాత్రి పండుగ మొదటి రోజు నుంచి అమల్లోకి రానుంది. తద్వారా పన్ను శ్లాబు 18 శాతానికి తగ్గనుంది.

ఈ ఏసీలపై డిస్కౌంట్లు, మరెన్నో డీల్స్ :
బ్లూ స్టార్, హైయర్ వంటి కంపెనీలు ఇప్పటికే ప్రీ-బుకింగ్ యూనిట్లను ప్రారంభించాయి. జూన్ త్రైమాసికంలో అకాల వర్షాల కారణంగా అమ్మకాలు తగ్గాయి. ఏసీ తయారీదారులు సులభమైన ఫైనాన్సింగ్, ఫ్రీ ఇన్‌స్టాలేషన్, గ్యాస్ ఛార్జింగ్‌తో ఎక్స్ టెండెడ్ వారంటీలు, జీరో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో అందిస్తున్నారు.

Read Also : Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

“కస్టమర్ల రెస్పాన్స్ బాగుంది. మా డీలర్లు ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 22న బిల్ చేస్తారు. ఆ తేదీన కొత్త GST రేట్లు వర్తిస్తాయి” అని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ అన్నారు. భారీ ఆర్డర్‌ల కోసం కంపెనీ ఇన్‌స్టాలేషన్ టీంలను కూడా రెడీ చేస్తోందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 22 తర్వాత రవాణా కోసం ప్రొడక్టులపై ఎంఆర్‌పీ లేబులింగ్, ఇ-వే బిల్లు సిస్టమ్ కూడా అప్‌డేట్ చేసింది.

రూ. 1కే ప్రీ-బుకింగ్ ఆఫర్ :

హేయర్ (Haier) కేవలం రూ.1కే ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన పేమెంట్ మెథడ్స్‌పై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఫ్రీ ఇన్‌స్టాలేషన్, గ్యాస్ ఛార్జింగ్‌తో ఐదేళ్ల వారంటీ, ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

బుకింగ్ విండో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్య కొనుగోళ్లు చేయొచ్చు. హేయర్ 1.6-టన్ను, 5-స్టార్ ఏసీపై రూ.3,905, 1.0-టన్, 3-స్టార్ ఏసీపై రూ.2,577 వరకు ధరలు తగ్గింపు పొందవచ్చు.

జీఎస్టి రేట్ల తగ్గింపు అనేది భారతీయ వినియోగదారుల సెంటిమెంట్‌ను పెంచుతుందని హైయర్ అప్లయన్సెస్ భారత్ అధ్యక్షుడు ఎన్ఎస్ సతీష్ అన్నారు. ఈ సంస్కరణతో దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుందని ఆయన అన్నారు.

గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ అప్లియన్సెస్ బిజినెస్ హెడ్ ఈవీపీ కమల్ నంది మాట్లాడుతూ.. డీలర్లలో కొందరు ముందస్తు బుకింగ్‌లు తీసుకుంటున్నారని, కంపెనీ స్వయంగా ప్రీ బుకింగ్స్ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే, సెప్టెంబర్ 22 తర్వాత ఏసీ యూనిట్లకు వర్తించే కొత్త MRP స్టిక్కర్‌లతో గోద్రేజ్ అందించనుంది.

గత జూన్ త్రైమాసికంలో అకాల వర్షాలు, ముందస్తు రుతుపవనాల కారణంగా ఏసీ పరిశ్రమ ఆదాయంపై భారీ ప్రభావాన్ని చూపింది. గత ఏడాది ఇదే కాలంలో అధిక సేల్స్ నమోదయ్యాయి.