Air India Flights: కస్టమర్ సేవ, సాంకేతికంగానూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: చైర్మన్
కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ, సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు

Chandra
Air India Flights: ఎన్నో వ్యయప్రయాసల అనంతరం ఎయిర్ ఇండియా విమాన సంస్థను తిరిగి చేజిక్కించుకున్న టాటా గ్రూప్ యాజమాన్యం, విమానయాన కార్యకలాపాను గదిలో పెట్టె దిశగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఎయిర్ ఇండియా సంస్థను నమ్ముకుని ఉన్న ఉద్యోగులతో పాటు.. కస్టమర్లలోనూ విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్. ఈమేరకు ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఇటీవల పంపిన వీడియో మేసేజ్ లో.. పలు విషయాలు పంచుకున్న ఎన్.చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియాకు తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలనీ ఉద్యోగులకు సూచించారు.
Also read: Yes Bank: రూ.300కోట్ల మోసం కేసు నిందితుడికి బెయిల్
15 నిముషాల నిడివిగల వీడియో సందేశంలో ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా భవిష్యత్తుపై ఉద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ, సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. ఎపుడు విమాన ప్రయాణం చేయాల్సి వచ్చినా వినియోగదారులు ఎయిర్ ఇండియానే ఎన్నుకునే విధంగా ఉత్తమ సేవలు అందిస్తామని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.
Also read: IT Raids on Huawei: చైనా ఫోన్ సంస్థ హువావే భారత కార్యాలయాల్లో ఐటీ దాడులు
ఎయిర్ ఇండియా కార్యకలాపాల్లో పారదర్శకతను ప్రదర్శించి, బుకింగ్ నుంచి బోర్డింగ్ వరకు అన్ని సేవలను డిజిటల్ మయం చేస్తామని, దీంతో వినియోగదారులు ఎక్కడా ఇబ్బంది ఎదుర్కొనే సమస్య ఉండదని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. అందుకోసం టాటా గ్రూప్ లో తిరిగి చేరిన ఎయిర్ ఇండియా విభాగంలో భారీ మార్పులు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా సీఈఓగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐసీని నియమించింది టాటా సంస్థ. ఇటీవలే ఆయన బాధ్యతలు కూడా చేపట్టినట్లు తెలుస్తుంది.
Also read: Elon Musk : చిన్నారుల ఆకలి తీర్చేందుకు.. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళం.