Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై సరికొత్త డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Amazon Great Summer Sale : మీరు కూడా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్‌ప్లస్ ఫోన్‌లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై సరికొత్త డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Amazon Great Summer Sale ( Image Credit : Google Images )

Amazon Great Summer Sale : ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కొనసాగుతోంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై వివిధ ధరల్లో సరికొత్త డీల్స్ అందిస్తోంది. ఈ అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, బడ్జెట్-ఫ్రెండ్లీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ వంటి లేటెస్ట్ మోడల్‌లు ఉన్నాయి. అన్నీ మోడల్స్ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్‌ప్లస్ ఫోన్‌లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Read Also : Amazon Sale 2024 : అమెజాన్‌లో రూ.30వేల లోపు ధరలో స్మార్ట్‌టీవీలపై బెస్ట్ డీల్స్ మీకోసం.. ఏ టీవీ ధర ఎంతంటే?

వన్‌ప్లస్ 12 :
లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 5,400ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అసలు ధర రూ. 64,999 ఉండగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా రూ. 2వేలు తగ్గింపును పొందవచ్చు. తద్వారా ఈ వన్‌ప్లస్ 12 ఫోన్ ధర రూ. 62,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే యూజర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఇతర ప్రమోషన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ 12ఆర్ :
జనవరి 23, 2024న లాంచ్ అయిన వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 8జీబీ/16జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజీ ఆప్షన్లు, 50ఎంపీ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 39,999 ఉంటుంది. కానీ, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,750 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 38,249కి తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే యూజర్ల కోసం ఆఫర్‌లను ఓసారి చెక్ చేయండి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ :
ఆగస్ట్ 4, 2023న లాంచ్ అయిన ఈ కొత్త మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+తో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 782జీ చిప్‌సెట్, 80డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఆప్షన్లలో 8జీబీ/12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజీ ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 50ఎంపీ, ధర రూ. 26,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, సేల్ సమయంలో రూ. 18,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే యూజర్లు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ :
ఏప్రిల్ 11, 2023న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ విడుదలైంది. ఈ లైట్ వెర్షన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్‌సెట్‌తో వస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జింగ్‌తో 8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజీ, 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అసలు ధర రూ.19,999 కాగా, ఇప్పుడు సేల్ ధర రూ.17,249కు పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ తుది ధరను రూ. 16,249కి తగ్గించవచ్చు. ఐసీఐసీఐబ్యాంక్, అమెజాన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్‌ల కోసం చూడండి.

వన్‌ప్లస్ నార్డ్ 3 :
జూలై 11, 2023 నుంచి వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+తో 6.74-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. 80డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

8జీబీ/16జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ ఫోన్ ప్రారంభ ధర రూ. 33,999 ఉంటుంది. ఈ సేల్‌తో వన్‌ప్లస్ నార్డ్ 3 ధర రూ.28,999కి పడిపోయింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. తుది ధరను రూ. 26,999కి తగ్గించవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే యూజర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్‌లను తప్పకుండా ఉపయోగించుకోండి.

Read Also : OnePlus Pad : అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్‌పై అదిరే ఆఫర్లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!