Deliver iPhones : పండగ చేస్కోండి.. ఇకపై అమెజాన్ డ్రోన్లతో ఐఫోన్లు డెలివరీ.. ఈ సిటీల్లో మాత్రమే.. ఎక్కడెక్కడంటే?
Deliver iPhones : అమెజాన్ డ్రోన్లతో ఎంపిక చేసిన పలు నగరాల్లో ఐఫోన్‌లను డెలివరీ చేయనుంది. ప్రైమ్ ఎయిర్ సర్వీస్ ద్వారా అత్యంత వేగంగా డెలివరీ చేయనుంది.

Deliver iPhones
Deliver iPhones : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. కొత్త ఐఫోన్ ఆర్డర్ చేస్తే కేవలం గంటలోపే మీ ఇంటి వద్దకు డెలివరీ (Deliver iPhones) అవుతుంది. అవును మీరు చదివింది నిజమే..
అమెజాన్ డ్రోన్ సర్వీసు ద్వారా ఇది సాధ్యమే. అమెజాన్ డ్రోన్ డెలివరీ ప్రోగ్రామ్‌ను విస్తరించడానికి యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుంచి ఆమోదం పొందింది. ఇప్పుడు ఆపిల్ iPhone, AirPods, AirTags వంటి ఖరీదైన టెక్ గాడ్జెట్లను ఇంటి వద్దకే డ్రోన్లతో డెలివరీ చేయనుంది.
అమెజాన్ డ్రోన్లతో 2022లో డెలివరీ సర్వీస్,ప్రైమ్ ఎయిర్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలలో ముఖ్యంగా, ఫీనిక్స్, అరిజోనా, కాలేజ్ స్టేషన్, టెక్సాస్‌లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది.
ఈ సర్వీసుకు 5 పౌండ్ల (సుమారు 2.2 కిలోగ్రాములు) వరకు బరువున్న ప్యాకేజీలను గంటలోపు నేరుగా కస్టమర్ ఇంటి వద్దకు లేదా డ్రాప్-ఆఫ్ పాయింట్‌కు డెలివరీ చేయగలవు.
(Deliver iPhones) డ్రోన్లపై లిమిట్స్ :
సాధారణంగా, డ్రోన్ డెలివరీలు పగటిపూట, వెదర్ బాగున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. డ్రోన్ల వినియోగంపై కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
వర్షాల సమయంలో లేదా రాత్రి పూట డ్రోన్లు ఎగరకూడదు. డెలివరీ ప్రదేశం అడ్డంకులు లేకుండా ఉండాలి. డ్రోన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి.
అమెజాన్ ఐఫోన్ ప్రీమియం ఫోన్లను డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేయనుంది. ప్రస్తుతానికి అమెజాన్ రెండు అమెరికా నగరాల్లో మాత్రమే డ్రోన్ డెలివరీల ద్వారా ఐఫోన్లను డెలివరీ చేస్తోంది.
Read Also : iQOO Neo 10 Pro Plus : భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరించాలని యోచిస్తోంది. యూకే, ఇటలీలకు డ్రోన్ డెలివరీని అందించనున్నట్టు తెలిపింది. అయితే, ఆ దేశాలలో డ్రోన్ల వినియోగంపై ఆమోదం పొందాల్సి ఉంది.