Gold: బంగారం ధరలు పెరుగుతున్నా.. కొనాలన్న కోరికను చంపుకోకుండా భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా? మీరూ ఇలా చేస్తున్నారా?

బంగారం కొనుగోళ్ల విషయంలో భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా?

Gold: బంగారం ధరలు పెరుగుతున్నా.. కొనాలన్న కోరికను చంపుకోకుండా భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా? మీరూ ఇలా చేస్తున్నారా?

Updated On : February 26, 2025 / 8:18 PM IST

బంగారు ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న క్రమంలో ఇండియాలో బంగారం కొనేవారు తమ ఆలోచనలను మార్చుకొని తక్కువ క్యారెట్ బంగారు ఆభరణాలను కొనాలని చూస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది.

సాంప్రదాయంగా, భారతీయులు తమ అందచందాల కోసం (ఆభరణాలు, అలంకరణలు), స్టేటస్ కోసం బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టేవారు. అయితే, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొనేవారు కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. దానిలో భాగంగానే ట్రేండింగ్, తేలికపాటి డిజైన్లను కలిగిఉన్న 22 క్యారెట్ బంగారు ఆభరణాలే ఈ సమయంలో బెస్ట్ అని వారు అనుకుంటున్నారట.

ఎందుకిలా?
రిచ్ లైఫ్ స్టైల్ కోసమో, ఏదైనా అకేషన్ కోసమో, అలాగే మార్కెట్ లో ఉన్న బంగారం డిమాండ్ వల్లనో వంటి అనేక అంశాలపై బంగారం కొనాలా? వద్దా? అని ఆలోచిస్తారని కల్యాణ్ జ్యూయలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణ రామన్ అన్నారు. వివాహాల కోసం కొనేవారు బంగారం రేట్ తో సంబంధం లేకుండా ప్రీమియం, భారీ ఆభరణాలను ఎంచుకుంటున్నారని అలాగే అంతర్జాతీయ శైలి కలిగిన వజ్ర, రత్న ఆభరణాలపై ఆసక్తి చూపిస్తన్నారని కల్యాణ రామన్ అన్నారు.

“ఇక పండుగల సందర్భాల్లో కొనుగోలు చేసే వినియోగదారులు తక్కువ బరువు ఉండి, మంచి ఆకర్షణీయంగా ఉండే డిజైన్లను కోరుకుంటున్నరని తెలుసుకొని వారికోసం తక్కువ క్యారెట్‌లో అందమైన డిజైన్లు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల ఎన్నడూ లేని విధంగా 18 క్యారెట్ ఆభరణాల కొనుగోలు కూడా 22 క్యారెట్‌తో పాటు ప్రాచుర్యం పొందుతోంది” అని కల్యాణ రామన్ తెలిపారు.

బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, బంగారం కొనాలనే కోరికను చంపుకోక పండుగలు లేక ఇతర సందర్భాల్లో 18 లేదా 14 క్యారెట్ బంగారు ఆభరణాలను కొంటున్నారని పిపి జ్యూయలర్స్ బిజినెస్ హెడ్ పవన్ గుప్తా అన్నారు

తక్కువ ఖర్చుతో ఆకర్షణీయంగా వెండి ఆభరణాలు మార్కెట్ లో ఉండడం వల్ల ముఖ్యంగా యువతలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయని వివిధ జ్యూయలర్స్ అధినేతలు వెల్లడించారని సర్వే పేర్కొంది. అలాగే కొనేవారి ఆలోచనలను బట్టే గోల్డ్ మార్కెట్ మారుతుందని, ఇంతకుముందు బంగారాన్ని లాకర్లలో భద్రపరచుకునే వారు. అయితే, ఇప్పుడు ఆభరణాలు భద్రపరిచేందుకు కాకుండా, క్యాజువల్ గాధరించేందుకు రూపొందించబడుతున్నాయని చెప్పింది.

దీనిని బట్టి సగటు పసిడి ప్రియులు దాని రేట్ తో సంబంధం లేకుండా వారి దగ్గర ఉన్న డబ్బులతో తక్కువ క్యారెట్ బంగారం అయినా కొంటున్నారని తెలుస్తోంది. అంటే 24 క్యారెట్ నుంచి 9 క్యారెట్ బంగారు ఆభరణాలకు ట్రెండ్ మారుతుందని బంగారం వ్యాపారం చేసే నిపుణులు అంటున్నారు.