ఇన్ఫోసిస్ నుంచి మరో సీనియర్ అధికారి ఔట్

  • Published By: chvmurthy ,Published On : January 9, 2019 / 04:35 AM IST
ఇన్ఫోసిస్ నుంచి మరో సీనియర్ అధికారి ఔట్

బెంగుళూరు:  ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో  సీనియర్ స్ధాయి అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి సంస్ధను వీడుతూనే ఉన్నారు. గతేడాది  సంస్ధలోని సీనియర్ అధికారులు ఇద్దరు సంస్ధ నుంచి వెళ్లిపోగా  లేటెస్ట్గ్ గా సంస్ధ గ్లోబల్ హెడ్(ఎనర్జీ,యుటిలిటీ,రిసోర్సెస్ సర్వీసెస్ విభాగం) సుదీప్ సింగ్  తనపదవికి రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలపాటు సంస్ధలో పని చేసిన  సుదీప్ సారధ్యంలోని ఈ విభాగం 100 మిలియన్ డాలర్ల నుంచి 750 మిలియన్ డాలర్లకు చేరింది. 
సుదీప్ రాజీనామాపై స్పందించేందుకు సంస్ధ నిరాకరించింది.  కన్సల్టింగ్ విభాగం గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ గత ఏడాది అక్టోబరులో రాజీనామా చేయగా, అంతకు ముందు మరో కీలకమైన అధికారి   చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎండీ.రంగనాధ్ కూడా  తన పదవినుంచి ఆగస్టులో తప్పుకున్నారు.