Apple Delhi Store : ఆపిల్ రెండో స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ముందు భారీగా క్యూ కట్టిన కస్టమర్లు..!
Apple Delhi Store : భారత్‌లో ఆపిల్ (Apple) రెండో స్టోర్ ప్రారంభమైంది.. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్‌ను ఓపెన్ చేశారు. ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందుగానే ఆపిల్ కస్టమర్లు భారీగా క్యూ కట్టారు.

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi
Apple Delhi Store : ప్రపంచ ఐకానిక్ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఢిల్లీలోని ఆపిల్ సాకెత్ (Apple Saket) స్టోర్ ప్రారంభమైంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) చేతుల మీదుగా ఢిల్లీ స్టోర్ ఓపెన్ అయింది. ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందే ఆపిల్ కస్టమర్లు, టెక్ ఔత్సాహికులు భారీగా క్యూలో నిలబడ్డారు. ఆపిల్ సాకెత్ స్టోర్ ఓపెన్ చేయగానే అక్కడి వారంతా బిగ్గరగా అరుస్తూ సందడి చేశారు. ముంబై స్టోర్ మాదిరిగానే ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి అదిరే రెస్పాన్స్ వచ్చింది.

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi
ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏప్రిల్ 20న (గురువారం) తెల్లవారుజామున చాలా మంది స్టోర్ తెరవకముందే బారులు తీరారు. భారత రెండో ఆపిల్ స్టోర్‌ను టెక్ దిగ్గజం CEO టిమ్ కుక్ ఢిల్లీ స్టోర్ ప్రారంభించడాన్ని చూసేందుకు అనేక మంది వచ్చి స్టోర్ ముందు క్యూలో నిలబడ్డారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ స్టోర్ ఓపెన్ చేయగానే.. కుక్ ఆపిల్ కస్టమర్‌లను స్వాగతించారు. అనంతరం ఆయన ఆపిల్ అభిమానులతో కలిసి ఫొటోలు దిగడంతో ఢిల్లీ స్టోర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi
దక్షిణ ఢిల్లీలోని (Apple Saket) స్టోర్ కోసం ప్రత్యేకమైన బారికేడ్ డిజైన్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 18న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ప్రారంభించిన ఆపిల్ స్టోర్ కన్నా ఢిల్లీ సాకేత్ స్టోర్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఢిల్లీలోని ఆపిల్ సాకెత్ స్టోర్ ముంబై స్టోర్‌లో సగం పరిమాణంలో ఉంది. ఇక్కడ కంపెనీ స్టోర్ నుంచి మొత్తం అమ్మకాలలో కొంత భాగాన్ని అద్దెగా లేదా నెలకు రూ. 40 లక్షలుగా ఆపిల్ చెల్లిస్తుంది. ఆపిల్ కంపెనీకి సాకేత్ స్టోర్‌లో 70 కన్నా ఎక్కువ మంది రిటైల్ టీమ్ సభ్యులు ఉన్నారు.
వీరంతా భారత్‌లోని 18 రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆపిల్ టీమ్‌లో 15 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు ఉన్నారు. మరోవైపు.. ఐఫోన్ (iPhone) తయారీదారు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. ఆపిల్ స్టోర్ల ప్రారంభం నేపథ్యంలో టిమ్ కుక్ భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిశారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఐఫోన్ తయారీదారు భారత్‌లో కాంట్రాక్ట్ తయారీదారులతో ఉపాధిని రెట్టింపు చేసి త్వరలో 2 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
#WATCH | Apple CEO Tim Cook inaugurates India’s second Apple Store at Delhi’s Select City Walk Mall in Saket. pic.twitter.com/KnqGiaf7oX
— ANI (@ANI) April 20, 2023
ఏడేళ్ల తర్వాత భారత్‌కు టిమ్ కుక్..
ఏడేళ్ల తర్వాత ఆపిల్ సీఈఓ కుక్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. దేశంలోనే ఆపిల్ ఫస్ట్ అధికారిక రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించారు. టెక్ దిగ్గజం దేశంలో కార్యకలాపాలను ప్రారంభించిన సమయంలో ఆయన చివరిసారిగా 2016లో భారతకు వచ్చారు. గత 15 ఏళ్లలో ఆపిల్ తన వ్యాపారాన్ని చైనాను మించి మరింత విస్తరిస్తోంది. దేశంలో భారీ మార్కెట్‌ను విస్తరిస్తున్న మిడిల్ క్లాస్ విక్రయాల వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తోంది.

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi
మిలియన్ల కొద్దీ ఆపిల్ డివైజ్‌ల ఉత్పత్తికి హోమ్ బేస్‌గా మారింది. కుక్ తన పర్యటనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను కలిశారు. అందిన సమాచారం ప్రకారం.. భారత్‌లో ఆపిల్ విడి భాగాల సరఫరాదారుల స్థావరాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వ మద్దతును కుక్ కోరినట్టు తెలిసింది. బెంగళూరులో తయారీ సౌకర్యాలతో పాటు యాప్ డిజైన్, యాక్సిలరేటర్ అభివృద్ధిపై ఆయన మంత్రులిద్దరితో చర్చించినట్టు సమాచారం.
Read Also : Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!