Apple iPhone 15 : పండగ చేస్కోండి.. ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గిందోచ్.. రూ.10,910 డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. లాస్ట్ జనరేషన్ ఐఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 10వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది.

Apple iPhone 15 : పండగ చేస్కోండి.. ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గిందోచ్.. రూ.10,910 డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

Apple iPhone 15

Updated On : June 24, 2025 / 6:46 PM IST

Apple iPhone 15 : కొత్త ఐఫోన్‌ కొందామని అనుకుంటున్నారా? విజయ్ సేల్స్‌లో బ్యాంక్ డిస్కౌంట్లతో ఐఫోన్ 15పై అద్భుతమైన డీల్‌ను పొందవచ్చు. ఆపిల్ స్టోర్‌లో (Apple iPhone 15) రూ. 69,990 ధరకు లభించే ఈ ఐఫోన్ డ్యూయల్ కెమెరా, సెటప్, టైప్-C పోర్ట్, డైనమిక్ ఐలాండ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది.

ఐఫోన్ 15 కొనుగోలుపై ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.10,900 కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. రూ.60వేల లోపు ధరలో ఐఫోన్ 15 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ధర :
ప్రస్తుతం రూ.61,990కి ఐఫోన్ 15 అందుబాటులో ఉంది. సాధారణ ధర కన్నా రూ.7,910 తక్కువ. యాక్సిస్, ఐసీఐసీఐ, HDFC బ్యాంక్ నుంచి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ.3వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈఎంఐలో కొనుగోలు చేస్తే రూ.3,500 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Tecno Spark Go 2 : AI ఫీచర్లతో టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ అదుర్స్.. నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.. ధర కూడా చాలా తక్కువే..!

ఈఎంఐ నెలకు రూ.2,888 నుంచి ప్రారంభమవుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఐఫోన్ 15 కొనాలని భావిస్తే.. ప్లాట్‌ఫారమ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. కస్టమర్‌లు భవిష్యత్ కొనుగోళ్ల కోసం రీడీమ్ పాయింట్లను అందుకుంటారు. అదనంగా, అదనపు చెల్లిస్తే ఆపిల్ కేర్ ప్లస్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
వెనిల్లా ట్రిమ్ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండవు. బ్యాటరీ సామర్థ్యం బాగుంది. 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ బ్యాకప్‌ పొందవచ్చు. ఈ ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. 48MP వైడ్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ కలిగి ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కూడా పొందవచ్చు.