Atal Pension Yojana : ‘అటల్ పెన్షన్ స్కీమ్’తో అద్భుతమైన బెనిఫిట్స్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.. 60ఏళ్లు నిండాక నెలకు రూ. 5వేలు పెన్షన్..!

Atal Pension Yojana : అటల్ పెన్షన్ ద్వారా రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీ వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Atal Pension Yojana : ‘అటల్ పెన్షన్ స్కీమ్’తో అద్భుతమైన బెనిఫిట్స్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.. 60ఏళ్లు నిండాక నెలకు రూ. 5వేలు పెన్షన్..!

Atal Pension Yojana

Updated On : March 11, 2025 / 6:27 PM IST

Atal Pension Yojana : భవిష్యత్తు గురించి ఆందోళన అక్కర్లేదు. వృద్ధాప్యంలో డబ్బు కోసం ఎవరి మీద ఆదారపడాల్సిన పనిలేదు. ఇప్పటినుంచే మీ వంతు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం మొదలుపెడితే చాలు.. 60 ఏళ్లు నిండాక మీకు నెలవారీగా రూ. 5వేల వరకు పెన్షన్ వస్తుంది.

ఆ పెన్షన్‌తోనే మిగిలిన జీవితాన్ని గడిపేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఇప్పుడే అటల్ పెన్షన్ యోజన పథకం(APY)లో చేరడమే. వాస్తవానికి ఈ పథకం ఆదాయపు పన్ను పరిధిలోకి రాని భారతీయులకు వర్తిస్తుంది.

Read Also : Airtel Weekend Data : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. రూ.59కే వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్లాన్.. మిగిలిన డేటాను వాడేసుకోవచ్చు!

ఈ పథకం కింద 60 ఏళ్ల వయస్సు వరకు కొద్ది మొత్తంలో చందా చెల్లిస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఈ అటల్ పెన్షన్ కింద మీకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీకు ఎంత పెన్షన్ వస్తుందనేది మీరు చెల్లించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

మీ వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి, మీరు పన్ను చెల్లింపుదారు కాకుంటే మీరు కూడా ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పథకంలో ఎలా చేరాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇలా అప్లై చేయండి :
మీరు అటల్ పెన్షన్ యోజనకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు మీరు బ్యాంకుకు వెళ్లి ఫారమ్ నింపాలి. మీరు నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి APY కోసం సెర్చ్ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌లో మీ వివరాలను నింపిన తర్వాత, ఫారమ్‌ను సమర్పించి ఆటో డెబిట్‌ ఆప్షన్ ఎంచుకోండి. తద్వారా ప్రతి నెలా ప్రీమియం మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. అయితే, ఈ APY ఫారమ్‌లో నామినీ వివరాలను ఇవ్వడం అసలు మర్చిపోవద్దు.

Read Also : Holi 2025 : హోలీ రోజున మీ మొబైల్ ఫోన్లు జాగ్రత్త.. ఇలా చేస్తే రంగు నీళ్లలో పడినా ఫోన్ పాడైపోదు.. తప్పక తెలుసుకోండి!

దరఖాస్తు విధానం ఇలా :

  • ముందుగా (https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html) వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • మీరు అటల్ పెన్షన్ యోజన ట్యాబ్‌కి వెళ్లి APY రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపి (Continue) క్లిక్ చేయండి.
  • ఫారమ్ నింపండి. కంప్లీట్ పెండింగ్ రిజిస్ట్రేషన్‌లో మీ వివరాలను ఎంటర్ చేయండి. ఆపై KYC పూర్తి చేయండి.
  • ఆ తరువాత రసీదు నెంబర్ జనరేట్ అవుతుంది.
  • 60 ఏళ్ల తర్వాత మీకు ఎంత పెన్షన్ కావాలో ఎంచుకోండి.
  • అలాగే వాయిదాను నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షికంగా ఎలా ఉండాలో సెట్ చేయండి.
  • ఆ తర్వాత నామినీ ఫారమ్‌ను సరిగ్గా నింపండి.
  • మీరు NSDL వెబ్‌సైట్‌లోని (eSign) ట్యాబ్‌కు రీడైరెక్ట్ అవుతారు.
  • ఆధార్ OTP వెరిఫికేషన్ తర్వాత ఈ పథకంలో చేరినట్టే.

ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి : 

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టెన్త్ మెమో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు
  • భారత పౌరసత్వ ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ ఖాతా నంబర్, బ్రాంచ్ వివరాలు
  • APY రిజిస్ట్రేషన్ ఫారమ్
  • ఆధార్ కార్డు