ఆటో రంగంలో సంక్షోభం.. రికార్డు స్థాయిలో సేల్స్ ఢమాల్!

ఇండియాలో ఆటో మొబైల్ రంగాన్ని సంక్షోభం వెంటాడుతోంది. నెలవారీ ప్యాసింజర్ వెహికల్స్, కారు సేల్స్ రికార్డు స్థాయిలో పడిపోయాయి. 1998 నుంచి ఆటో రంగంలో సేల్స్ కంటే ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో సేల్స్ పడిపోయాయి. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానిఫాక్చరర్స్ (SIAM) రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఏడాది ఏడాదికి 31.57శాతానికి క్షీణించి ఆగస్టు నెలలో 196వేల 524 యూనిట్లు తగ్గిపోయాయి. ప్యాసింజర్ కారు సేల్స్ 41.09శాతం క్షీణించి 115వేల 957 యూనిట్లకు పడిపోయాయి. SIAM డేటాను 1997-98 రికార్డు చేయడం ప్రారంభించనప్పటి నుంచి కేటగిరీలుగా సేల్స్ పడిపోతూ వచ్చింది. ట్రక్కు, బస్ సేల్స్ 39శాతానికి పడిపోయాయి.
ద్విచక్ర వాహనాల సేల్స్ 22శాతం క్షీణించి 1.5మిలియన్ల యూనిట్లకు తగ్గిపోయాయి. భారత అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజూకీ గతవారమే తమ ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల్లోనే హర్యాణా, మనేసర్, గూర్గావ్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి నిలిపివేసింది. రెండు ప్లాంట్లను మారుతి కంపెనీ ఒకేసారి మూసివేయడం ఇదే తొలిసారి. ఆటో సెక్టార్‌లో సేల్స్ క్షీణించడంతో భారీగా ఉద్యోగాల్లో కోతకు దారి తీసింది. ఆటో మేకర్లు, ఇతర తయారీ సంస్థలు, డీలర్లు కూడా తమ కంపెనీల్లో ఏప్రిల్ నుంచి 3లక్షల 50వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు నివేదిక తెలిపింది.
ఆటో మేకర్లకు గడ్కరీ భరోసా :
గతవారమే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించే యోచన లేదని ఆటో మేకర్లకు భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక కారణాలతో ఆటో రంగం భారీగా క్షీణించిందని గడ్కరీ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందన్నారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కూడా పన్నును తగ్గించాలనే డిమాండ్లపై కూడా దృష్టిపెట్టినట్టు గడ్కరీ చెప్పారు. అక్టోబర్-నవంబర్ నెలలు పండగ సీజన్ కావడంతో మళ్లీ తమ ఆటో సేల్స్ పెరుగుతాయని ఆటో మేకర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడాదిలో మూడో వంతు వాహనాల సేల్స్ ఈ సీజన్ లోనే ఎక్కువగా ఉంటాయి.