రికీ ఈ-రిక్షా లాంచ్‌కి బజాజ్ ఆటో సిద్ధం.. ఆ కంపెనీ ప్లాన్లు అదుర్స్‌..

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మేము ఆగస్టు 10న రికీ బ్రాండ్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తాము” అని అన్నారు.

రికీ ఈ-రిక్షా లాంచ్‌కి బజాజ్ ఆటో సిద్ధం.. ఆ కంపెనీ ప్లాన్లు అదుర్స్‌..

Updated On : August 7, 2025 / 4:28 PM IST

బజాజ్ ఆటో కొత్త బ్రాండ్ రికీ పేరుతో ఈ-రిక్షాను మార్కెట్లోకి తీసుకురానుంది. ఆగస్టు 10న విక్రయాలు ప్రారంభమవుతాయి. వీటి ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మేము ఆగస్టు 10న రికీ బ్రాండ్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తాము” అని అన్నారు. ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ ఆ సంస్థ దశలవారీగా వాటిని రిలీజ్ చేయాలని ప్రణాళిక వేస్తోంది.

“గోగో మోడల్‌లాగే మేము దీన్ని క్రమంగా అభివృద్ధి చేస్తాము. మేము దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లే ముందు 1 లేదా 2 క్వార్టర్లు వేచిచూస్తాం, ఎందుకంటే ఉత్పత్తి పూర్తిగా సరైనదిగా ఉండాలి” అని బజాజ్ అన్నారు.

Also Read: మీరు బంగారు, వెండి రాఖీలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

“ఎలక్ట్రిక్ టెక్నాలజీ విషయంలో మేము ఇంకా టెక్నాలజీ, ఉత్పత్తి, కస్టమర్ సర్వీస్ వంటి అన్ని అంశాల్లో నేర్చుకునే దశలో ఉన్నాము” అని చెప్పారు. గోగో మోడల్ ఈ-త్రీవాలర్ విభాగంలో మెరుగ్గా రాణిస్తోంది. ఇప్పుడు బజాజ్ ఆటో రికీ ద్వారా తదుపరి ప్రయత్నాన్ని ప్రారంభిస్తోంది.

బజాబ్ వాహనాలకు దేశంలో డిమాండ్ బాగా ఉంటుంది. బజాజ్ బ్రాండ్‌ను దేశంలోని చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు కొత్త బ్రాండ్ రికీ పేరుతో ఈ-రిక్షాను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆ సంస్థ సిద్ధమైంది.