Raksha Bandhan 2025: మీరు బంగారు, వెండి రాఖీలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

వెండి రాఖీ కట్టడాన్ని కొన్ని ఇళ్లలో శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య ప్రకారం, సోదరుడికి జాతకంలో చంద్ర దోషం ఉంటే.. వెండి రాఖీ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకం.

Raksha Bandhan 2025: మీరు బంగారు, వెండి రాఖీలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Updated On : August 7, 2025 / 3:05 PM IST

రాఖీ పౌర్ణమిని ఈ ఏడాది ఆగస్టు 9న జరుపుకోనున్నారు. చక్కటి నూలు రాఖీలను కొనుక్కునే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ.. బంగారం, వెండి రాఖీలను కట్టడాన్ని సంప్రదాయంగా భావిస్తుంటారు చాలా మంది.

వెండి రాఖీ
వెండి రాఖీ కట్టడాన్ని కొన్ని ఇళ్లలో శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య ప్రకారం, సోదరుడికి జాతకంలో చంద్ర దోషం ఉంటే.. వెండి రాఖీ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకం.

వెండి శాంతి, మానసిక ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. ఇది మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుందని వారి నమ్మకం. జ్యోతిష్య నమ్మకాలకు ప్రాధాన్యం ఉన్న కుటుంబాలు వెండి రాఖీలను వాడుతుంటాయి.

Also Read: న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి : వైఎస్ సునీత

బంగారు రాఖీ
వైభవంగా రాఖీ పౌర్ణమిని జరుపుకునే కుటుంబాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో బంగారు రాఖీలను వాడుతుంటారు. కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ సీఈవో పారాగ్ షా తెలిపిన వివరాల ప్రకారం.. బంగారు రాఖీలపై అభిరుచి పెరుగుతోంది. కొంతమంది వినియోగదారులు పండుగల సమయంలో చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేసే అలవాటును పెంచుకుంటున్నారు. బంగారు రాఖీలను కట్టడాన్ని సంప్రదాయంగానూ, ఆర్థికంగా ఉపయోగపడేదిగానూ భావిస్తున్నారు.

కొనే ముందు వీటిని పరిశీలించాలి
ప్యూరిటీ, హాల్‌మార్క్ చూడాలి. హాల్‌మార్క్ ఉన్న బంగారు లేదా వెండి రాఖీలు ఎంచుకోవాలి. నాజూకు డిజైన్‌లకు 14 కేటీ లేదా 18 కేటీ బంగారం ఎక్కువగా ఉపయోగపడుతుంది. కేటీ (KT) అంటే కారట్ అనే బంగారపు స్వచ్ఛత ప్రమాణం. 24 కేటీ అంటే 100% స్వచ్ఛమైన బంగారం. 14 లేదా 18 కేటీ బంగారం తక్కువ స్వచ్ఛతతో ఉంటుంది.

వ్యక్తిత్వానికి తగిన డిజైన్ ఎంచుకోవాలి. ఓం, గణేశ్ వంటి ధార్మిక చిహ్నాలు నుంచి ఇన్ఫినిటీ, ఈవిల్ ఐ వంటి ఆధునిక శైలుల వరకు సోదరుడికి నచ్చే డిజైన్ ఎంచుకోవాలి. ఈవిల్ ఐ అనేది చెడు దృష్టిని దూరం చేసే రక్షణ చిహ్నంగా భావిస్తారు.

కొన్ని బంగారు రాఖీలను పండుగ తర్వాత విడదీసి కూడా వాడుకోవచ్చు. వీటిని పెండెంట్ లేదా బ్రేస్‌లెట్‌లా వాడవచ్చు. బంగారం, వెండి వస్తువులు కొనేటప్పుడు నాణ్యత ముఖ్యం.