న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి : వైఎస్ సునీత

వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.

న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి : వైఎస్ సునీత

YS Sunitha Reddy

Updated On : August 7, 2025 / 2:49 PM IST

YS Sunitha: గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకానంద రెడ్డి హత్య గుర్తుకు వస్తుందని వైఎస్ సునీత అన్నారు. గురువారం కడప జిల్లా ఎస్పీని ఆమె కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గొడ్డలి పోటుతో వివేకా పడిఉంటే గుండె పోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేశారు. వివేకా హత్య తరువాత లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టామన్నారు.. కానీ, నేను పెట్టలేదని సునీత చెప్పారు.

Also Read: Tariff War: ట్రంప్ సుంకాల బాదుడుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారికోసం రాజీపడే ప్రసక్తే లేదు..

వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు జడ్పీసీటీ ఉప ఎన్నికల్లో అదే జరుగుతుంది. అప్పుడు టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. ఇప్పుడు సురేశ్ అనే వ్యక్తి మా బంధువు.. అతనిపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉందని సునీత అన్నారు.

గత ఆరేళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా.. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకా హత్య సునీతా, రాజశేఖర్ రెడ్డి చేయించారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. నాన్న మళ్లీ తిరిగిరాడు.. ప్రజలు ఆలోచించి నిజం బయటికి వచ్చేలా చూడాలని సునీత అన్నారు.

రేపు వివేకానందరెడ్డి పుట్టినరోజు.. నా తల్లి నాకు పులివెందుల రావద్దని చెప్తుంది. న్యాయంకోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉందని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు.