Best Premium Flagship Phones : ఈ ఏప్రిల్‌లో భారత్‌‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Best Premium Flagship Phones : ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 15ప్రో, మరో 3 ఫోన్లు ఉన్నాయి.

Best Premium Flagship Phones : ఈ ఏప్రిల్‌లో భారత్‌‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Best premium flagship phones to buy in India this April 2024

Best Premium Flagship Phones : టాప్-ఆఫ్-ది-లైన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత్‌లో అనేక హాటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆప్షన్లతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాతో బడ్జెట్ సమస్య కానట్లయితే.. ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 15 ప్రో సిరీస్, మరో మూడు ఫోన్లు ఉన్నాయి.

Read Also : Best Phones in India : ఈ ఏప్రిల్‌లో రూ.50వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఐఫోన్ 15 ప్రో, 15ప్రో మ్యాక్స్ :
అత్యంత ఖరీదైన ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 15 ప్రో సిరీస్, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ రెండూ సరికొత్త ఆపిల్ టెక్‌ని కలిగి ఉన్నాయి. ఇందులో పవర్‌ఫుల్ ఎ17 ప్రో చిప్, అద్భుతమైన కెమెరా సిస్టమ్, ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌కు ప్రాధాన్యతనిచ్చే వారికి పెద్ద స్క్రీన్, బ్యాటరీని అందిస్తుంది. వాస్తవానికి, ఐఫోన్‌లలో పర్ఫార్మెన్స్, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తాయి. లేటెస్ట్ ఐఫోన్ 15 ప్రో సిరీస్‌కు భిన్నంగా ఏమీ ఉండదు. అత్యుత్తమ ఐఫోన్ కావాలంటే.. బడ్జెట్‌లో ఐఫోన్ 15 ప్రో సిరీస్ బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

షావోమీ 14 5జీ :
షావోమీ 14 విషయానికి వస్తే.. పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్‌‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండగా, అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీయడానికి లైకా సహకారంతో ట్యూన్ చేసిన కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. 90డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో, షావోమీ 14 సూపర్‌ఫాస్ట్‌ను ఛార్జ్ చేస్తుంది. కాంపాక్ట్ డిజైన్‌కు తగిన 4,610ఎంఎహెచ్ బ్యాటరీ సైజు కలిగి ఉంది.

వన్‌ప్లస్ 12 5జీ :
వన్‌ప్లస్ 12 ఫోన్ 120హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ చేసే కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, 5,400ఎంఎహెచ్ బ్యాటరీ, 100డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్, 50డబ్ల్యూ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 వంటి ఫీచర్లతో వస్తోంది. హుడ్ కింద ప్రాసెసర్, హసెల్‌బ్లాడ్ సహకారంతో ట్యూన్ చేసిన బెస్ట్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. వన్‌ప్లస్ 12 కూడా ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెంట్, రాబోయే ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. వన్‌ప్లస్ 12తో ఆఫర్‌లో ప్రారంభ ధర రూ. 64,999గా నిర్ణయించింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల ధర రూ. లక్ష కన్నా ఎక్కువగా ఉంటుంది.

ఐక్యూ 12 5జీ :
ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కోసం చూస్తుంటే.. ఐక్యూ 12 5జీ ఫోన్ సరైన ఆప్షన్. ఈ ఫోన్ ధర వన్‌ప్లస్ 12 కన్నా తక్కువగా ఉంటుంది. కొన్ని ఫీచర్లను పక్కన పెడితే ఐక్యూ 12 తక్కువ ధరకే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. హుడ్ కింద అదే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్, 144హెచ్‌జెడ్ ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, సింగిల్ 50ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరాతో కూడిన కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. వన్‌ప్లస్ 12తో పోలిస్తే.. ఐక్యూ 12 వైర్‌లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెన్స్ వంటి కొన్ని ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Ather Rizta Scooter : టీవీఎస్, ఓలా, బజాజ్, హీరోకు పోటీగా.. సరసమైన ధరకే కొత్త ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. 160కి.మీ రేంజ్..!